సీనియర్ ఐపీఎస్‌లకు ‘లాక్‌డౌన్‘ బాధ్యతలు
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం పది రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను అమలు చేయాలని నిర్ణయించినందున హైదరాబాద్ నగరంలో పర్యవేక్షణ బాధ్యతలను నలుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు అప్పగించారు డీజీపీ మహేందర్ రెడ్డి. ముగ్గురు అదనపు పోలీసు కమిషనర్‌లతో పాటు ఒక జాయింట్ కమిషనర్‌కు వేర్వేరు బాధ్యతలను అప్పజెప్పారు. ఈస్ట్ జోన్‌కు షికా గోయల్, సెంట్రల్-వెస్ట్ జోన్‌కు అనిల్ కుమార్, సౌత్ జోన్‌కు డీఎస్ చౌహాన్, నార్త్ జోన్‌కు జాయింట్ కమిషనర్ అవినాష్ మొహంతికి […]
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం పది రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను అమలు చేయాలని నిర్ణయించినందున హైదరాబాద్ నగరంలో పర్యవేక్షణ బాధ్యతలను నలుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు అప్పగించారు డీజీపీ మహేందర్ రెడ్డి. ముగ్గురు అదనపు పోలీసు కమిషనర్‌లతో పాటు ఒక జాయింట్ కమిషనర్‌కు వేర్వేరు బాధ్యతలను అప్పజెప్పారు. ఈస్ట్ జోన్‌కు షికా గోయల్, సెంట్రల్-వెస్ట్ జోన్‌కు అనిల్ కుమార్, సౌత్ జోన్‌కు డీఎస్ చౌహాన్, నార్త్ జోన్‌కు జాయింట్ కమిషనర్ అవినాష్ మొహంతికి అప్పగించారు.
లాక్‌డౌన్ బుధవారం ఉదయం నుంచే అమల్లోకి వస్తున్నందున తొలి మూడు రోజుల పాటు ఉదయం పది గంటలకే క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాలని, ప్రజలకు అవగాహన కలిగిస్తూ నిబంధనలు ఉల్లంఘించినవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని డీజీపీ వీరికి ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో లాఠీఛార్జి చేయవద్దని, వీలైనంత వరకు ఆ అవసరం రాకుండా చూడాలని నొక్కిచెప్పారు.