Karnataka lockdown news: కర్నాటకలో లాక్‌డౌన్ పొడిగింపు
దిశ, వెబ్‌డెస్క్ : కర్నాటకలో పాజిటివ్ కేసులు పెరుగుతున్న కారణంగా కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసుల తీవ్రత తగ్గకపోవడంతో లాక్‌డౌన్ మరోసారి పొడిగిస్తున్నట్టు సీఎం యడియూరప్ప గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. లాక్‌డౌన్‌ను ఈనెల 14వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ఏ రంగానికి కూడా ప్రభుత్వం సడలింపులు ఇవ్వలేదు. లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 500 కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. […]
దిశ, వెబ్‌డెస్క్ : కర్నాటకలో పాజిటివ్ కేసులు పెరుగుతున్న కారణంగా కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసుల తీవ్రత తగ్గకపోవడంతో లాక్‌డౌన్ మరోసారి పొడిగిస్తున్నట్టు సీఎం యడియూరప్ప గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
లాక్‌డౌన్‌ను ఈనెల 14వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ఏ రంగానికి కూడా ప్రభుత్వం సడలింపులు ఇవ్వలేదు. లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 500 కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. పవర్ లూమ్ కార్మికులకు, మత్స్యకారులకు, దేవాదాయ శాఖ అర్చకులకు, ఆశా వర్కర్లకు రూ. 3వేలు ఇస్తున్నట్టు సీఎం యడియూరప్ప వెల్లడించారు.