ఆటో ఇండస్ట్రీలో రోజుకు రూ. 2,300 కోట్ల నష్టం!
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 మహమ్మారి, సంబంధిత అంతరాయాల కారణంగా ఆటోమోటివ్ పరిశ్రమ రోజుకు రూ. 2,300 కోట్ల నష్టాన్ని పొందింది. అలాగే, ఈ రంగంలో సుమారు 3.45 లక్షల ఉద్యోగాలు పోయాయని పార్లమెంటరీ ప్యానెల్ నివేదిక మంగళవారం వెల్లడించింది. ‘తక్కువ డిమాండ్, వాహనాల అమ్మకాలు తగ్గడం వల్ల అన్ని ప్రధాన ఒరిజినల్ పరికరాల తయారీదారులు తమ ఉత్పత్తిని 18-20 శాతం తగ్గించాలని ఆటో పరిశ్రమ సంఘాలు కమిటీకి తెలియజేశాయి. దీంతో ఆటో రంగంలో అత్యధికంగా 3.45 లక్షల […]
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 మహమ్మారి, సంబంధిత అంతరాయాల కారణంగా ఆటోమోటివ్ పరిశ్రమ రోజుకు రూ. 2,300 కోట్ల నష్టాన్ని పొందింది. అలాగే, ఈ రంగంలో సుమారు 3.45 లక్షల ఉద్యోగాలు పోయాయని పార్లమెంటరీ ప్యానెల్ నివేదిక మంగళవారం వెల్లడించింది. ‘తక్కువ డిమాండ్, వాహనాల అమ్మకాలు తగ్గడం వల్ల అన్ని ప్రధాన ఒరిజినల్ పరికరాల తయారీదారులు తమ ఉత్పత్తిని 18-20 శాతం తగ్గించాలని ఆటో పరిశ్రమ సంఘాలు కమిటీకి తెలియజేశాయి. దీంతో ఆటో రంగంలో అత్యధికంగా 3.45 లక్షల ఉద్యోగాల నష్టం అంచనా వేస్తున్నట్టు’ ప్యానెల్ తన నివేదికలో తెలిపింది.
ఆటో పరిశ్రమలో కొత్త కార్మికులను తీసుకోవడం ఆగిపోయాయి. అంతే కాకుండా ఆటోమొబైల్ రంగంలో ఉత్పత్తి తగ్గించడం వల్ల, ఎంఎస్ఎంఈ విభాగంలోని కాంపొనెంట్ పరిశ్రమపై ప్రతికూల ప్రభావం ఉన్నట్టు నివేదిక తెలిపింది. ప్రస్తుత సంక్షోభాన్ని పరిశీలిస్తే..ఆటోమొబైల్ పరిశ్రమ కనీసం రెండేళ్ల పాటు తీవ్రమైన సంకోచాన్ని ఎదుర్కొనే అవకాశముందని, దీనివల్ల తక్కువ సామర్థ్య వినియోగానికి దారితీస్తుంది. భవిష్యత్తులో పెట్టుబడులు తగ్గిపోవచ్చు, కొన్ని సంస్థలు దివాలా తీసే ప్రమాదం ఉండొచ్చు, మొత్తం పరిశ్రమలో ఉద్యోగ నష్టాలు ఉండొచ్చని కమిటీ వెల్లడించింది.