బిహార్‌లో లాక్‌డౌన్ పొడిగింపు
పాట్నా: కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో బిహార్‌లో లాక్‌డౌన్‌ను వచ్చే నెల 1వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు సీఎం నితీశ్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై మంత్రివర్గం, అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన తర్వాత ఈ నిర్ణయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. లాక్‌డౌన్‌తో సత్ఫలితాలు వస్తున్నాయని, కరోనా వ్యాప్తికి కళ్లెం పడుతున్నదని వివరించారు. అందుకే జూన్ 1వ తేదీ వరకు లాక్‌డౌన్ పొడిగించాలనే నిర్ణయం తీసుకున్నట్టు వారు తెలిపారు. కరోనా కేసులు, మరణాలు ఒక్కసారిగా […]
పాట్నా: కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో బిహార్‌లో లాక్‌డౌన్‌ను వచ్చే నెల 1వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు సీఎం నితీశ్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై మంత్రివర్గం, అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన తర్వాత ఈ నిర్ణయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. లాక్‌డౌన్‌తో సత్ఫలితాలు వస్తున్నాయని, కరోనా వ్యాప్తికి కళ్లెం పడుతున్నదని వివరించారు.
అందుకే జూన్ 1వ తేదీ వరకు లాక్‌డౌన్ పొడిగించాలనే నిర్ణయం తీసుకున్నట్టు వారు తెలిపారు. కరోనా కేసులు, మరణాలు ఒక్కసారిగా పెరుగుతుండటంతో మే 5న రాష్ట్రప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. అనంతరం దీన్ని ఈ నెల 25వ తేదీ వరకు పొడిగించింది. తాజాగా, మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్ కాలంలోనూ రోజులో నాలుగు గంటలు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అత్యవసర సరుకులు అందించే షాపులు తెరుచుకోవడానికి అనుమతినిచ్చారు. కరోనా నిబంధనలను కచ్చితంగా అమలు చేసే కఠిన నిర్ణయాలనూ ప్రభుత్వం తీసుకుంది.