MORE సూపర్ మార్కెట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. వర్కర్లపై స్థానిక.. (వీడియో)
దిశ, మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని మణుగూరు మండలంలో సంచలన ఘటన చోటుచేసుకుంది. నూతనంగా ప్రారంభించిన మోర్ షాపింగ్ మాల్ పై స్థానిక వ్యాపారస్తులు మూకుమ్మడిగా వాగ్వాదానికి దిగిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మోర్ షాపింగ్ మాల్ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల నిత్యవసర సరుకులను ఏర్పాటు చేసింది. ఆ నిత్యవసర సరుకుల ధరలు స్థానికంగా ఉన్న సూపర్ మార్కెట్, కిరాణ దుకాణాల కంటే తక్కువ […]
దిశ, మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని మణుగూరు మండలంలో సంచలన ఘటన చోటుచేసుకుంది. నూతనంగా ప్రారంభించిన మోర్ షాపింగ్ మాల్ పై స్థానిక వ్యాపారస్తులు మూకుమ్మడిగా వాగ్వాదానికి దిగిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మోర్ షాపింగ్ మాల్ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల నిత్యవసర సరుకులను ఏర్పాటు చేసింది.
ఆ నిత్యవసర సరుకుల ధరలు స్థానికంగా ఉన్న సూపర్ మార్కెట్, కిరాణ దుకాణాల కంటే తక్కువ ధరలో లభించడంతో మాకంటే తక్కువ రేటుకు విక్రయిస్తారా అంటూ మండలంలోని కొందరు దుకాణాదారులు మోర్ సంస్థ ఉద్యోగులపై వాగ్వాదానికి దిగారు. ఏజెన్సీ ఏరియాలో నీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రెండు వర్గాల మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.
అతి తక్కువ ధరలకు నిత్యవసర సరుకులు విక్రయిస్తుంటే మణుగూరుకు చెందిన ప్రముఖ వ్యాపారస్తులు మోర్ షాపింగ్ మాల్‌పై వాగ్వాదం ఎందుకు చేస్తున్నారని ప్రజలు వాపోయారు. ఏజెన్సీ ప్రాంతం అయిన మణుగూరు మండలంలో 80% గిరిజనులు, హరిజనులు నివసిస్తుండటంతో వ్యాపారస్తులు ఇష్టారీతిన యథేచ్ఛగా వ్యాపారాలు కొనసాగిస్తున్నారు.
వారికి ఇష్టం వచ్చిన ధరలకు నిత్యవసర వస్తువులను అమ్ముతున్నారని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.