తిమింగలం నోట్లో సముద్రపు డైవర్.. ఎలా బయటపడ్డాడు?

దిశ, ఫీచర్స్ : సముద్రపు లోతుల్లోని రహస్యాలను, ఖనిజ సంపదను అన్వేషించేందుకు.. అరుదైన జీవుల జాడను, వాటి జీవన విధానాన్ని తెలుసుకునేందుకు డైవర్లు(సముద్రపు ఈతగాళ్లు) ప్రయత్నిస్తారన్న విషయం తెలిసిందే. ఇది కొంతమందికి హాబీ కాగా, మరికొందరు దీన్నే ప్రొఫెషనల్‌గా కొనసాగిస్తుంటారు. అయితే యూఎస్‌లోని ఓ కమర్షియల్ లాబ్‌స్టర్ డైవర్ తాజాగా భారీ తిమింగలం(హంప్‌బ్యాక్) నోటికి చిక్కి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఇన్సిడెంట్ గురించి మీడియాతో పంచుకున్నాడు. బార్న్‌స్టేబుల్ కౌంటీలోని […]

Update: 2021-06-12 00:38 GMT

దిశ, ఫీచర్స్ : సముద్రపు లోతుల్లోని రహస్యాలను, ఖనిజ సంపదను అన్వేషించేందుకు.. అరుదైన జీవుల జాడను, వాటి జీవన విధానాన్ని తెలుసుకునేందుకు డైవర్లు(సముద్రపు ఈతగాళ్లు) ప్రయత్నిస్తారన్న విషయం తెలిసిందే. ఇది కొంతమందికి హాబీ కాగా, మరికొందరు దీన్నే ప్రొఫెషనల్‌గా కొనసాగిస్తుంటారు. అయితే యూఎస్‌లోని ఓ కమర్షియల్ లాబ్‌స్టర్ డైవర్ తాజాగా భారీ తిమింగలం(హంప్‌బ్యాక్) నోటికి చిక్కి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఇన్సిడెంట్ గురించి మీడియాతో పంచుకున్నాడు.

బార్న్‌స్టేబుల్ కౌంటీలోని వెల్‌ఫ్లేట్‌కు చెందిన 56 ఏల్ల మైకేల్ ప్యాకర్డ్.. సముద్రపు అడుగుభాగం నుంచి లాబ్‌స్టర్స్(పీతలు) సేకరిస్తుంటాడు. ఈ మేరకు శుక్రవారం ప్రావిన్స్‌టౌన్‌లోని సముద్ర ప్రాంతంలో 14 మీటర్ల లోతున ఉండగా.. ఒక్కసారిగా కుదుపులకు గురవడంతో పాటు చుట్టూ చీకటి ఆవహించినట్టు అనిపించిందని తెలిపాడు. సాధారణంగా తను సంచరిస్తున్న జలాల్లో సొరచేపలు ఎక్కువగా ఉంటాయని తెలిసినన మైకేల్.. అదే దాడి చేసిందని భావించినా ఎటువంటి నొప్పి, పంటి స్పర్శ తగలకపోవడంతో తేల్చుకోలేకపోయాడు. చివరకు తిమింగలం నోట్లో ఉన్నట్టు గుర్తించానని, అప్పటికే అది తనను మింగేందుకు ప్రయత్నిస్తోందని చెప్పాడు. ఆ సమయంలో ఇక చావు తప్పదని ఫిక్స్ అయ్యానని.. అప్పుడు ఆలోచనలన్నీ భార్య, పిల్లల చుట్టే తిరిగాయని వెల్లడించాడు. తిమింగలం నోటికి చిక్కి 30 సెకన్లు దాటినా, తన దగ్గరున్న ఆక్సిజన్ ఎక్విప్‌మెంట్‌తో శ్వాసించగలిగానని చెప్పుకొచ్చాడు. అయితే కొంతసేపటి తర్వాత పైకొచ్చిన తిమింగలం ఒక్కసారిగా తలను విదిలించి ఉమ్మడంతో తను బయటపడ్డాడు. వెంటనే సర్ఫేస్ బోట్‌లో ఉన్న సిబ్బంది మైకేల్‌ను రక్షించగలిగారు. ఈ ప్రమాదంలో మైకేళ్లు కాళ్లకు గాయాలయ్యాయి.

కాగా ఇలాంటి ఘటనలు జరగడం చాలా అరుదని సెంటర్ ఫర్ కోస్టల్ స్టడీస్‌లో సీనియర్ సైంటిస్ట్, వేల్ ఎక్స్‌పర్ట్ అయిన చార్మీ స్టార్మీ మయో తెలిపాడు. నిజానికి హంప్‌బ్యాక్స్ అంత అగ్రెసివ్‌గా ఉండవని, అది సాండ్‌ల్యాన్స్(ఒక రకమైన చేపలు)ను ఆహారంగా తీసుకుంటున్న క్రమంలో యాక్సిడెంటల్‌గా ఇలా జరగవచ్చని అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News