వెన్నెల పూలు..

Poem

Update: 2024-09-29 18:45 GMT

ఆమె ఎప్పుడూ అలా

పూచిన వరి కంకులా నవ్వుతూ ఉంటుంది

ఎప్పుడు పలకరించినా

తనే మన క్షేమాన్ని అడుగుతు వుంటుంది

అదెలా సాధ్యమో కదా

ఆ తరానికి వాళ్ళొక గుర్తుగా

తాము దాటి వచ్చిన అగడ్తలపై

వంతెనలు కడుతూ మనకు దారికావడం

తమ చేతివేళ్ళతో ఆకాశమంతా

వెన్నెల పూలు పూయించడం

తెలిసిన వాళ్లకి మనమేమి ఇవ్వగలం

ఆ దారిలో మనమూ కాసింత

అలసట తీరా నడవడం తప్ప!

వారికొక గులాబీ పూల గుత్తును

ఇచ్చి నమస్కరిద్దాం!!

(క్రిష్ణాబాయి గారికి జన్మదిన శుభాకాంక్షలతో )

కెక్యూబ్ వర్మ

94934 36277

Tags:    

Similar News