ఇప్పుడైతే తీరికగా
పెట్టే, బేడా సర్దుకుని,
రాత్రికి తినాల్సినవేవో
భద్రంగా పేక్ చేసుకుని,
అద్దంలో ఒకసారి ముఖం చూసుకుని,
వేసుకున్న బట్టలు సరి చేసుకుని,
కిటికీలకు, తలుపులకు గడియలు పెట్టి,
అన్నీ ఒకటికి పదిసార్లు తనిఖీ చేసి,
వీధి గుమ్మానికి అరచెయ్యంత తాళం బిగించి,
ఇరుగు పొరుగులకు
టాటాలు, బైబైలు చెప్పి,
భూమ్మీద ఎక్కడికైనా సంబరపడుతూ
బయలుదేరుతామా...
కానీ, చివరాఖరికి
ఎక్కడనుంచో ఇక్కడికి పంపిన వారు,
మళ్లీ వెనక్కి రమ్మని పాశం విసిరితే,
ఉన్నపాళంగా వెళ్లక తప్పుతుందా..?
మల్లాప్రగడ రామారావు
9989863398