ఆగిపో రాత్రి
నిలబడి పో చంద్రుడా
ఈ ప్రేమ మైదానంలో
వెన్నెల స్నానం చేయాలి
ప్రేమ జ్వాలలు చల్లార నివ్వు...
కోరికల కోడె నాగులు
మొగలి పొద కోరుతున్నాయి
విరహాగ్ని నీటితో చల్లారదు
ప్రేమ ముడుల మురిపాలు
వెన్నల చినుకుల్లో తడవాలి...
ఆనందం అనంతాలదాక సాగాలి
వేకువ ప్రేమ దుఃఖాన్ని
తెర తీయక ముందె
అందాక ఆగిపో రాత్రి
జీవితాను భూతులు
పూలపరిమణాలాలో
తడిసి తూగి సాగి పోయె దాక
ఆగిపో ఆగిపో...
రేడియమ్
9291527757