పాదాల్లో తడి అరని కన్నీళ్లు

Poem

Update: 2024-09-01 18:30 GMT

సూర్యుడి ఎప్పటిలాగే

మబ్బుల్ని చీల్చుకుంటూ

నేలపై సేద తీరుతున్నాడు...

నిశ్శబ్దంగా గడియారం

క్షణ క్షణానా మనిషిని

గతం నుండి భవిష్యత్‌లోకి

విశ్వాంతర మార్గాన నడిపిస్తుంది...

చీకటిలో అదృశ్యమయ్యే

గతం గాయాలు

రూపాన్ని మార్చుకున్న

కాల ప్రయాణంలో మాత్రం

మనిషి పాదాల్లో తడి అరని కన్నీళ్ళయ్యాయి

నిలువెత్తు శరీరానికి

అంగు హార్భటాలతో

బంగారు సొగస్సులు అలంకరించిన

రోజు రోజుకి శరీరం మెత్తబడిపోతూనే ఉన్నా

ఆశల పల్లకీలు మోస్తున్నాడు...

మరణం కౌగిలిస్తున్నా

మనిషి మనిషిని

చంపుకునే ద్వేషంతో

నిద్రను కల్లోలంలోకి

నెట్టేస్తున్నాడు.....

మనసుతో మాట్లాడు

మనసుతో బంధాలను కలుపుకొని

మనసుతో దగ్గరవ్వు

మానవత్వం ఉన్న మనిషిగా మసులుకో...

ఎలగొండ రవి

98487 70345

Tags:    

Similar News

ఎర్ర శిఖరం!
బుల్డోజరు