లక్ష మెదళ్ళను.. కదిలించిన
ఒక్క సిరాచుక్క
అవినీతి అక్రమాలను..
ఎదిరించిన ఒక్క తెల్ల చొక్క
తెలంగాణ యాసను.. భాషగ
నిలిపిన ఒక్క కవన రెక్క
పరాయి పాలనను..
పెకిలించిన ఒక్క వేగు చుక్క
తెలుగు సాహిత్యంలో..
త్రిభాషా పండిత యుద్ధ నౌక
తెలగాణ గడ్డపై..
వెలిగిన అగ్నిశిఖ.. కాళోజీ..!
అతిథినై వచ్చాను.. అతిథిగానే
పోతానన్న నిరాడంబర జీవి
ప్రజల గొడవను..
"నాగొడవ"గా మార్చిన కలం..కారీ
వ్యంగ్య రచనలనే..
అస్త్రాలుగా సంధించిన గాండీవి
తెలంగాణ చరిత్రలో..
చిరస్మరణీయ ప్రజాకవి
ఓ కాళోజీ..
నువ్వే మన తెలంగాణ నేతాజీ
నా.. నుండి మా.. తోనే
దేశ ముందడుగన్న సవ్యసాచీ..!
తెలంగాణ యువతకు..
నువ్వే నిరంతర అక్షర దిక్సూచీ..!!
(కాళోజీ నారాయణరావు యాదిలో..)
-- పాల్వంచ హరికిషన్
95024 51780