సమైక్య పూలతోట

poem

Update: 2023-07-23 18:30 GMT

పాత మాటలు మానవోయి

కొత్త పాటలు పాడవోయి

పాతదారులు వదులు కుని

కొత్తదారులు నడవ వోయి

నీతుల కాలం పోయింది

చేతల కాలం వచ్చింది

దూరాలను తగ్గించే కొత్త

దారులకు స్వాగతాలు

శాస్త్ర జ్ఞానం శస్త్రజ్ఞానం

మేధకు కొత్త ఆలోచనలు

వాయుతీరున తోచు నోయి

మందబుద్ధుల జాడ లేదోయి

యువక దేశపు ప్రగతి జెండా

విశ్వయవనికపై వెలుగు నోయి

మత కుల వివక్షత లేని నేల

మనదే మనదే కదోయి

ఇక్కడ పుట్టిన ప్రతి జీవి

పంచభూతాల సాక్షిగా

స్వేచ్ఛ శ్వాసతో జీవించు

దేశసేవకై ప్రాణమిచ్చు

కలహాల కరవాలం

కాలం తీరి తుప్పు పట్టింది

సమైక్య పూలతోట

మమతల మందరాలు పూస్తుంది

రేడియమ్

9291527757

Tags:    

Similar News

వెలుగు

పగటి వేషం