దుఃఖ ఋతువు

poem

Update: 2023-07-23 18:30 GMT

పగటి కన్నా

రాత్రి అంటే నాకు భలే ఇష్టం

నేను కష్టపడేది

మరి రాత్రి పూటే

రాయడం నేర్చుకున్న నేను

బతుకును దాయడం నేర్చుకోలేకపోయా

కొందరందుకే,

నేనేదో నేరం చేసినట్టు

వీడింతేనా అని చూసే చూపులు

భవిష్యత్ ని కొరికేస్తున్నాయి

చిల్లులు పడ్డ కలల్ని

ఏరుకుని పోగేసుకుంటూ

కళ్ళకిందుగా లాగేసుకుని

వాటికో రూపాన్ని చేసే ప్రయత్నంలో

అప్పుడప్పుడు శ్వాస

తీసుకోవడం కూడా మర్చిపోతున్నాను

ఏడుపులను కడుపులో దాచుకుని

నవ్వులు వెదజల్లుతేనే

నలుగురిలో నిలబడగలుగుతున్న క్షణం

ఋతువులు మారినట్లే

మనుషులు మారుతున్నప్పుడు

దుఃఖ ఋతువును

గుండెలకు హత్తుకునేదెలా

- నామాల రవీంద్ర సూరి

98483 21079

Tags:    

Similar News

వెలుగు

పగటి వేషం