అనగారిన ఆర్థనాదాలు

poem

Update: 2023-07-16 18:30 GMT

ఓటుకు నోటేనా ప్రాతినిధ్యం

డబ్బేనా అన్నింటికి జవాబుదారి

డబ్బిచ్చి పాలకులవుతారు.

తీసుకొని పిచ్చోళ్ళు వెర్రి చూపులు చూస్తారు.

తుదిపోరులో నమస్కరించినావు

నేనెవ్వరో గుర్తు పట్టలేదు అన్నారు ఎమ్ఎల్.ఎ. గారు

ఓటును నోట్ పెట్టి వేలం వేసేవారు.

రేపు కాబోయే రాజ్యాధికారులు నేడు

ఎక్కడుంది మానవతా

ఏమైపోతుంది సమానత

అందలమెక్కి ఆస్తులు కాపాడుట కోసం.

బడా బాబు అవతారమెత్తుతారు

తినడానికి తిండిలేక వీరు

కట్టుకోను బట్టలేక చూడు తల్లడిల్లే అభాగ్యులెందరో..

వారు కారా భారతీయులు.

భారతమాత శృంకలాలు

చ్ఛేదించే వారు లేరా ఇకరారా

వస్తారు ఇంక వెనుక తిరిగి చూడు.

చ్చీచ్చీ చివరకు మానవత్వం మంట కలిసిపోయేనా

నర రూప రాక్షసులే పాలకులా యెనా…

సాయిమల్లు నడిగోటి

87125 83898

Tags:    

Similar News

వెలుగు

పగటి వేషం