అద్దె గర్భం

poem

Update: 2023-07-16 18:30 GMT

వైద్యరంగంలో ఎన్నో వైవిధ్యాలు

అద్భుత పరిచేది అద్దెగర్భం

వ్యందత్వం ఉంటే

అవకాశంగా తీసుకోవచ్చు!

నొప్పులు నచ్చక

మోయడం చేతకాక

దొరుకుతుంది కదా అని

అద్దెకు గర్భం ఆక్షేపనీయమే!

ఆగర్భ శ్రీమంతులు

తమకు ఆ గర్భం వద్దనుకుని

గరీబు వాళ్ళను గర్భానికి

చేసుకునే ఒప్పందాలు ఒప్పేనా!

ప్రోత్సహిస్తే దారి తప్పితే

పేద తల్లుల కడుపులు

పిల్లల కర్మాగారాలు అవుతావి

పైసా పై వ్యామోహం ప్రాణాలమీదికొస్తుంది!

కనకుండానే తల్లి అవుతుందొకరు

కన్నందుకు కూలీ అవుతుంది మరొకరు

కొంటే కూడా తల్లి అవుతారా

కన్నపేగు బంధం కానరాదెక్కడ!

మోసినమ్మకు పాప పై మోజు పెరగదా

కన్నప్రేమలు కాగితంపై రాతలేనా?

అమ్మకానికి అమ్మతనం!

కొనుక్కోవడం సమ్మతమేనా?

జగ్గయ్య.జి

9849525802

Tags:    

Similar News

వెలుగు

పగటి వేషం