ఒక అబల ఆర్తనాదం

poem

Update: 2023-06-25 18:45 GMT

ఇదో కొత్త మరక, మరో సరికొత్త మసక

ప్రతికూలం నుండి అనుకూలంకై భయపెట్టి

పాతుకుపోయిన నీచ భావజాల

వైరస్ స్వీయ నిర్మాణమే ఫోకస్

మగైతే వ్యాపార సంబంధం

ఆడైతే అక్రమ సంబంధం

గత్తర్లకాలం పోయింది

గద్దలకాలం వచ్చింది

కామం వెంటాడిన కారణంగా

ఒక తల్లి విలాపం

మోహం వేటాడిన మూలంగా

ఒక చెల్లి విషాదం..

ఇండియా గేట్ దిగులుపడుతుంది

ఢిల్లీ రోదిస్తుంది, రామ్ మనోహర్ లోహియా

గుండెలు బాదుకుంటుంది దేనికీ

పురుగుల మందు సమాధానం కాదని...

శేజల్‌లో సినీ కాజల్‌ని చూసిన

దుర్గం చిన్నయ్య కాదు నీవు

ద్వాపర యుగంలో కన్నయ్య

ఒక భూభాగపు స్త్రీల మనోభావాలకు

దర్పణంగా అన్నయ్య...

పేదల పక్షంగా, న్యాయం పక్షంగా

జనాల అవసరాలకు ఆసరావి భరోసావి

కానీ, మదంతో నీలో ఒక షాడో

అధికారదర్పంతో నీలో ఒక కామక్రీడో

సున్నితత్వం నీవైతే,

జాతీయ మహిళా కమిషన్

ఏమి చెయ్యదు

సరళత్వం నీవైతే

మానవ హక్కుల సంఘం

నిన్నేమీ ఆదుకోదు...

తల్లీ సూటిదనం సూదులు

చెల్లీ నిక్కచ్చితనం నిప్పులు తోడై

ధైర్యసాహసాలతో ముందడుగు పడనీ

మేథోసంద్రంలో తిరుగుబాటు తరంగాలు సాగనీ...

రేపు నుండి పోరాటం ఆరంభమైతే

ఆ పోరాటంలో మేం కూడా

అత్యాచారాలకి హత్యచారాలకి

వ్యతిరేకంగా గజ్జకట్టి ఆడుతూ

బాధింపుల వేధింపుల

తలవంపుల ఆత్మహత్యలకు

నిరసనగా గొంతెత్తుతూ..

(బెల్లంపల్లి ఎమ్మెల్యే లైంగిక దాడులకు నిరసనగా)

కోటం చంద్రశేఖర్

94920 43348

Tags:    

Similar News