శూన్యం

poem

Update: 2023-06-25 18:30 GMT

కాలం స్తంభించిపోతే

మౌనం ఘనీభవించిపోతే

దుఃఖం ఎడతెగని వానైతే

కుడి ఎడమల దగా

నిత్య జీవన సత్యమైతే..

రాయడానికి ఏముంటుంది

శూన్యం తప్ప..

నీటికీ యుద్దమే

నీడకూ యుద్దమే

నోటికాడికూడికి

శ్మశానంలో చోటుకీ

యుద్దమే అయినప్పుడు

రాయడానికి ఇంకేముంటుంది

'రణం' తప్ప..

బతుకుల్లో ఆశలు నింపుతారని

ఐదేళ్లకోసారి భంగపడడమే

ఆనవాయితీ అయినపుడు..

సర్కారు కుర్చీలు

సామాన్యుని బతుకు చీకట్లో

చిరుదీపాలు కాకున్న,

మిణుగురులనైన

కురిపిస్తాయని భ్రమ పడడమే

జీవితమైనపుడు రాయడానికి

ఏం మిగిలుంటుందని...

శూన్యం తప్ప..

శ్రీనివాస్ కాలె

90594 50418

Tags:    

Similar News