రాత్రి

poem

Update: 2023-06-25 18:30 GMT

పగటి పగుళ్లు

పూడ్చేందుకే

వస్తుంది రాత్రి

చుక్కల అస్తిత్వాన్ని

నిలపడానికే

వస్తుంది రాత్రి

శబ్దాలని నిద్రపుచ్చి

నిశ్శబ్దాన్ని బతికించడానికే

వస్తుంది రాత్రి

ఇల ఇరుసుపై కాలచక్రానికి

పగలు బొమ్మయితే

బొరుసులా

వస్తుంది రాత్రి

రంగుల భ్రమలు తుడిచేస్తూ

వర్ణ రహితమై

వస్తుంది రాత్రి

నిశాచారులతో బాతాఖానీకై

నీరవాన్ని మోసుకుని

వస్తుంది రాత్రి

చీకటి దర్బారులో

స్వప్నఖచిత సింహాసనంపై

కూర్చునేందుకే

వస్తుంది రాత్రి

మల్లారెడ్డి మురళీ మోహన్,

88611 84899

Tags:    

Similar News