వారం వారం మంచి పద్యం: చిన్నతనం

poem

Update: 2023-06-25 18:45 GMT

చెత్త సేకరిస్తూ జీవితం గడుపుతుంది బుంగి. ఫలితంగా పరిసరాలు శుభ్రం అయ్యాయి. తన సంపాదన మెరుగయింది. ఒకరోజు మా బడికి వచ్చి ‘సార్ మా తమ్ముని టీసీ( బదిలీ సర్టిఫికెట్) ఇవ్వు’ అంది. ‘నీవు ఎక్కడ ఉంటావు. ఏం పని చేస్తావు. నేను తెలుసా’ అని అడిగాను. ‘చెత్త పని చేస్త. నువ్వు తెల్వదు. కాగితం ఇస్తే పోత’ అంది. ‘నీవు చెత్తబండి డ్రైవ్ చేస్తవు కదా’ ‘మా తమ్ముని కాగితం ఇస్తే పోత’. నేను ఆలోచనలో పడ్డాను. ఇంతలో ఆమె సహచరుడు వచ్చాడు. నన్ను చూసి నవ్వి, తెలియనట్లున్నాడు. వాళ్ళిద్దర్నీ లోపలికి పిలిచాను. నా వివరాలు తెలిపి, ‘నన్ను గుర్తు పట్టారా’ అని అడిగాను. ‘ఇప్పుడు గుర్తుపట్టినం సార్’ అన్నారిద్దరూ. వాళ్ళలా ఎందుకు నటించారు? చేస్తున్న పనిపట్ల వారికి చిన్నతనం ఉందా? నా వల్ల వారికి అపకారం జరిగిందా? హెచ్చుతగ్గుల భావనలేమైనా వారిలో ప్రవేశించామా? దానికి కారకులెవరు? ప్రశ్నల పుట్ట ఒకటి నాలో పెరగడం ప్రారంభించింది.

చిత్తశుద్ధిగా చేసిన చెత్త పనికి

పరిసరములన్ని మారెను మురికి పోయి

చిన్నతనమనె మురికేల చిత్తమందు

కశప చెప్పిన కథనమ్ము కాంతి పధము

డా. బి.వి.ఎన్ స్వామి

92478 17732

Tags:    

Similar News