ప్రముఖ రచయిత, కవి డా. నందిని సిధారెడ్డి తెలంగాణలో అమరులైన వీరుల గురించి అక్షర నివాళి కవితా సంకలనంలో ‘కొత్త నక్షత్రం’ అనే కవిత రాశారు. ఈ కవితలో సిధారెడ్డి తెలంగాణలో పుట్టిన ప్రతి పౌరుడు మరువలేని గాధలను చూపారు. మంటలు తొడుక్కొని ఆహుతైన అమరుల పట్ల ఆయన రాసిన ఈ కవిత చూస్తుంటే, అలాంటి గాథలకు సలాం చెప్పాలి.
కవి, ఎవరైనా మంటలు తొడుక్కుంటే ఏమవుతుంది ప్రాణాలు పోతాయి. కానీ యువకులు తెలంగాణ కొరకు మంటలు తొడుక్కుని కాలి, వీరమరణం పొందారు, అలాగే రైలుకు ఎదురు వెళ్ళి కొంతమంది, చెట్టుకు వేలాడి కొంతమంది ప్రాణాలు విడిచారు. నెత్తుటితో ఎవరూ లేఖలు రాయరు..కానీ ఆ యువకులు తెలంగాణ కొరకు తమ రక్తాన్ని సిరాగా మార్చి లేఖలు రాసి గాథగా మిగిలారంటాడు. వాళ్ళ త్యాగం గొప్ప. తాము కలలు కన్నా తెలంగాణ గూర్చి ప్రాణాలు వదిలిన వారి త్యాగం స్వరాజ్య సాధన కోసం ప్రాణాలర్పించిన వీరులతో సమానమంటాడు.
తెలంగాణ కోసం కాలం ఆగి కన్నీళ్లు రాల్చిందంటాడు. వారి త్యాగానికి భూమి అందమైన మోదుగు పూలను, ఆనందంతో దోసిలి పట్టింది. వాళ్ళ లక్ష్యం పవిత్రమంటాడు కవి. అందుకే అమరుల కోసం స్థూపాన్ని ఏర్పాటు చేసి ఆ స్థూపాన్ని సందర్శించుకోవడం పవిత్రమంటాడు. వీరి త్యాగాలు చూసి మొగులు మీద తెలంగాణ నక్షత్రం పొడిచి, వారు కలలుకన్న తెలంగాణ కల సాకారమై 2014 జూన్ 2 తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిందని, ఆ ఉద్యమం నడిపిన బక్కపల్చని వ్యక్తి కేసీఆర్ త్యాగం తెలంగాణ చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించబడి ఉంటుందని కవి భావన.
రామాయణంకు మించిన గొప్ప కావ్యం లేదు. అలాంటి కావ్యంలోనే, రాముడి వీరోచితమైన గాథలకు రాముడు బ్రతికి ఉండగానే ప్రతినోట రామనామం వినిపించారు.. అలాగే మరువలేని మన గాథలకు సలాం చెబుదాం.. మంటలను తొడుకున్న, రైలుకు ఎదురు నడిచిన, చెట్టుకు వేలాడిన గాథలు అందరికి వినిపించాలి. ఆ వీరుల త్యాగం అనితర సాధ్యం, అయినా సాధించారు.
వారి త్యాగాలకు ఒక నక్షత్రం ఉంటుందంటూ..నందిని సిధారెడ్డి తెలంగాణలో పొడిచిన కొత్త నక్షత్రం చూశారు. తెలంగాణ కొత్త నక్షత్రంలో అమరులైన 1200 మంది యువకులు ఉంటారంటూ.. డాక్టర్ నందిని సిధారెడ్డి రాసిన కొత్త నక్షత్రం కవితను అభినందిస్తూ, ఆయన మరిన్ని మంచి రచనలు అందించాలని మనసారా కోరుకుంటున్నాను..
-నరేంద్ర సందినేని
70930 30259