వేలంలో లిక్కర్ షాపు ధర రూ. 510 కోట్లు.. 

జైపూర్: అదొక మారుమూల పల్లెటూరు. అక్కడ ఒక వైన్ షాపు ఉంది. దానికి ఇటీవలే వేలం నిర్వహించారు. రూ. 72 లక్షల వద్ద బిడ్డింగ్ స్టార్ట్ అయింది. దానిని దక్కించుకోవడానికి ఔత్సాహికులు ఎక్కడా లేని ఆసక్తి చూపారు. వేలం ప్రారంభమై షాపు ధర ఒక్కో లక్ష పెరిగింది. కోటి.. పది కోట్లు, యాభై కోట్లు.. వంద కోట్లు.. రెండు వందల కోట్లు దాటింది. అయినా వేలం ఆగలేదు. అలా పెరిగి పెరిగి చివరికి రూ. 510 కోట్ల […]

Update: 2021-03-08 11:07 GMT

జైపూర్: అదొక మారుమూల పల్లెటూరు. అక్కడ ఒక వైన్ షాపు ఉంది. దానికి ఇటీవలే వేలం నిర్వహించారు. రూ. 72 లక్షల వద్ద బిడ్డింగ్ స్టార్ట్ అయింది. దానిని దక్కించుకోవడానికి ఔత్సాహికులు ఎక్కడా లేని ఆసక్తి చూపారు. వేలం ప్రారంభమై షాపు ధర ఒక్కో లక్ష పెరిగింది. కోటి.. పది కోట్లు, యాభై కోట్లు.. వంద కోట్లు.. రెండు వందల కోట్లు దాటింది. అయినా వేలం ఆగలేదు. అలా పెరిగి పెరిగి చివరికి రూ. 510 కోట్ల వద్ద ఆగిపోయింది. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది.

హనుమాన్‌గఢ్ జిల్లా నోహర్‌లో ఉన్న వైన్ షాపు వేలంలో ఆశ్చర్యకరంగా రూ. 510 కోట్లు పలికింది. ఇటీవలే ఆన్‌లైన్ ద్వారా నిర్వహించిన ఈ-వేలం.. ఉదయం ప్రారంభమై ఏకంగా రాత్రి 2 గంటలకు ముగియడం గమనార్హం. ఆసక్తికరంగా 708 సార్లు దీనికోసం వేలం పాడారు ఇందులో పాల్గొన్న బిడ్డర్లు. గతేడాది ఈ షాపు రూ. 62 లక్షల ధర పలికింది.

 

Tags:    

Similar News