మేరీకోమ్‌ పాత్రకు ప్రియాంక పర్ఫెక్ట్ కాదు : నటి

దిశ, సినిమా :ప్రియాంక చోప్రాతో కలిసి ‘మేరీకోమ్’ సినిమాలో నటించిన మోడల్ లిన్ లైష్రామ్.. ఈ మూవీ కాస్టింగ్ విషయంలో జరిగిన వివక్ష గురించి మాట్లాడింది. మేరీకోమ్‌లో టైటిల్ రోల్ పోషించిన ప్రియాంక, ఇందుకోసం హార్డ్ వర్క్ చేసినా.. ఈ పాత్రను ఈశాన్య రాష్ట్రాలు లేదా మణిపూర్‌కు చెందిన అమ్మాయి పోషిస్తేనే తమను రిప్రజెంట్ చేసినట్టు ఉండేదని తెలిపింది. కాగా ఇండియన్ మోస్ట్ ఫేమస్ ఫిమేల్ బాక్సర్ మేరీకోమ్ జీవితం ఆధారంగా 2014లో వచ్చిన సినిమా నేషనల్ […]

Update: 2021-06-15 03:22 GMT

దిశ, సినిమా :ప్రియాంక చోప్రాతో కలిసి ‘మేరీకోమ్’ సినిమాలో నటించిన మోడల్ లిన్ లైష్రామ్.. ఈ మూవీ కాస్టింగ్ విషయంలో జరిగిన వివక్ష గురించి మాట్లాడింది. మేరీకోమ్‌లో టైటిల్ రోల్ పోషించిన ప్రియాంక, ఇందుకోసం హార్డ్ వర్క్ చేసినా.. ఈ పాత్రను ఈశాన్య రాష్ట్రాలు లేదా మణిపూర్‌కు చెందిన అమ్మాయి పోషిస్తేనే తమను రిప్రజెంట్ చేసినట్టు ఉండేదని తెలిపింది. కాగా ఇండియన్ మోస్ట్ ఫేమస్ ఫిమేల్ బాక్సర్ మేరీకోమ్ జీవితం ఆధారంగా 2014లో వచ్చిన సినిమా నేషనల్ అవార్డు దక్కించుకోగా.. నటి లిన్ ‘బెంబెమ్’ అనే పాత్రలో కనిపించింది. మణిపూర్‌లోని ఓ సాధారణ రైతు కూతురు నుంచి ఐదు వరల్డ్ చాంపియన్స్ గెలుచుకున్న బాక్సర్‌గా ఎదిగిన క్రమాన్ని మూవీలో చూపించారు.

మేరీకోమ్‌గా ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం ప్రియాంక హార్డ్ వర్క్‌ను చూస్తే.. మెచ్చుకోకుండా ఉండలేమని, కానీ సినిమాకు సంబంధించిన కాస్టింగ్ ఖచ్చితంగా ఇక్కడి ప్రజలను రిప్రజెంట్ చేసేలా ఉండాలని తెలిపింది. ఈశాన్యేతర ప్రాంతానికి చెందినవారు మేరీకోమ్ పాత్రకు పర్ఫెక్ట్ కాదని అభిప్రాయపడింది. అంతేకాదు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వారికి ఎందుకు అవకాశాలు ఇవ్వరు? వాళ్లు కూడా భారతీయులే కదా! అని ప్రశ్నించింది. ఇక 2007లో ‘ఓం శాంతి ఓం’ సినిమాలో కామియో రోల్ చేసిన లిన్.. ఉమ్రికా, రంగూన్ చిత్రాల్లోనూ నటించింది.

Tags:    

Similar News