ఘనంగా లైమ్ లైట్ అవార్డుల ప్రధానోత్సవం.. ఆ మహిళలు చాలా కష్టపడ్డారు
దిశ, బంజారాహిల్స్: జూబ్లీహిల్స్‌లోని జెఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో శుక్రవారం వైశ్య లైమ్ లైట్ అవార్డులు ప్రధానోత్సవం కార్యక్రమం జరిగింది. వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కననరచిన మహిళలకు ఈ అవార్డు ప్రదానం చేశారు. ఈ అవార్డుల కోసం వైశ్య సంఘలోని 515 మహిళలు దరఖాస్తు చేరుకోగా, అందులో 16 మంది సేవలను గుర్తించి అవార్డులతో సత్కరించారు. ఈ మహిళలు లింగ వివక్షతను అధిగమించి వారి హక్కుల కోసం కష్టపడి పనిచేశారని నిర్వాహకులు పేర్కొన్నారు. తాము ఎంచుకున్న రంగాల్లో […]
దిశ, బంజారాహిల్స్: జూబ్లీహిల్స్‌లోని జెఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో శుక్రవారం వైశ్య లైమ్ లైట్ అవార్డులు ప్రధానోత్సవం కార్యక్రమం జరిగింది. వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కననరచిన మహిళలకు ఈ అవార్డు ప్రదానం చేశారు. ఈ అవార్డుల కోసం వైశ్య సంఘలోని 515 మహిళలు దరఖాస్తు చేరుకోగా, అందులో 16 మంది సేవలను గుర్తించి అవార్డులతో సత్కరించారు. ఈ మహిళలు లింగ వివక్షతను అధిగమించి వారి హక్కుల కోసం కష్టపడి పనిచేశారని నిర్వాహకులు పేర్కొన్నారు. తాము ఎంచుకున్న రంగాల్లో ఎంతో పురోగతి సాధించారని అన్నారు.
ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వహకులు ఎమ్మడి శివ కుమార్ మాట్లాడుతూ.. వైశ్య సంఘంలో మహిళలు సాధించిన విజయాలను గుర్తించి వారిని ప్రోత్సహించడానికి ఈ అవార్డు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గణేష్ బిగాల గణేష్ గుప్తా, ఎమ్మెల్సీ దయానంద్, తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్, తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బొల్లం సంపత్ కుమార్, తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రీయల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అమరవాది లక్ష్మీనారాయణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ చీదెళ్ల రాధ గౌర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.