ఈ మొక్కతో బట్టతలపై హెయిర్ రావడం ఖాయం..

ప్రస్తుత రోజుల్లో ఏ జబ్బుకు అయినా మందు ఉంది

Update: 2023-04-25 12:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో ఏ జబ్బుకు అయినా మందు ఉంది. టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందడంతో ఎలాంటి వ్యాధికి అయినా దాదాపుగా మెడిసిన్ అందుబాటులో ఉంది. అయితే, ప్రజలు ఇప్పుడు మెడిసిన్ వాడుతున్నారు కానీ.. అప్పట్లో ఆయుర్వేద చికిత్సనే ఎక్కువగా నమ్మేవారు. ప్రకృతి నుండి లభించే మూలకాలే జబ్బులకు ఔషధాలుగా పనిచేసేవి.

కానీ, టెక్నాలజీ పెరగడం.. అత్యాధునిక సౌకర్యాలతో ఆసుపత్రులు అందుబాటులోకి రావడంతో ఆయుర్వేద వైద్యం కనుమరుగైంది. అయితే, ప్రస్తుతం ఓ సమస్య కోసం మళ్లీ ఈ చికిత్స వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారట. బట్టతల సమస్య ఉన్నవారు దానిని అధిగమించేదుకు ఆయుర్వేద వైద్యం వైపు చూస్తునారు. దీని కోసం పొలం గట్లపై అక్కడక్కడ కనిపించే తుంగ గడ్డి భూమి లోపల పొరల్లో ఉండే ‘‘తుంగ గడ్డలు’’.. బట్టతల ఉన్నవారికి వెంట్రుకలు మొలిపించడంలో ఎంతో ఉపయోగపడుతున్నాయంట.

*తుంగగడ్డలను ఎండబెట్టి కొబ్బరి ఆయిల్‌లో కలిపి మరగించి బట్టతల ఉన్నచోట్ల రాస్తే హెయిర్ తప్పకుండా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి.

*అలాగే తుంగ గడ్డల పొడిగా చేసి, అందులో చందనం మిక్స్ చేసి ఫేస్‌కు అప్లై చేస్తే పింపుల్స్ పోతాయి. ముఖంపై మచ్చలు పోయి అందంగా మెరుస్తుంది.

*తుంగ గడ్డలతో తయారు చేసిన కాషాయం కామెర్ల వ్యాధికి చక్కగా పనిచేస్తుంది.

*వీటిని కాసేపు వేడి నీటిలో ఉంచిన తర్వాత.. ఆ నీటిని తీసుకుంటే కాలేయంలో ఇన్ఫెక్షన్ తగ్గిపోయి.. జాండీస్ తగ్గుతాయి.

*ఒక రకంగా చెప్పాలంటే.. తుంగ గడ్డలతో అన్ని రకాల వ్యాధులకు చెక్ పెట్టొచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Also Read..

వడదెబ్బ అంటే ఏమిటి..? దాని నివారణ చర్యలు..! 

Tags:    

Similar News