Happy Friendship Day : దోస్త్ మేరా దోస్త్.. స్నేహితుల దినోత్సవం ఎందుకు జరుపుకుంటారంటే?

స్నేహం గురించి ఎంత చెప్పినా తక్కువే. దోస్త్ మేరా దోస్త్.. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెల అని స్నేహం గురించి ఎన్ని పాటలు పాడినా, ఎంత మంది కవులు వచ్చి స్నేహం గురించి పొగిడినా దాని గొప్పతనం

Update: 2024-08-04 03:42 GMT

దిశ, ఫీచర్స్ : స్నేహం గురించి ఎంత చెప్పినా తక్కువే. దోస్త్ మేరా దోస్త్.. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెల అని స్నేహం గురించి ఎన్ని పాటలు పాడినా, ఎంత మంది కవులు వచ్చి స్నేహం గురించి పొగిడినా దాని గొప్పతనం వర్ణించలేనిది. ఎందుకంటే స్నేహంలో ఉండే ప్రేమ అలా ఉంటుంది. మనకు ఏ చిన్న కష్టం వచ్చినా సరే ఆ కష్టాల్లో పాలు పంచుకోవడానికి ముందుండేది స్నేహితులే. అంతే కాకుండా,మనం మనకు ఎలాంటి సంఘటనలు ఎదురైనా లేదా మన ఇంటిలో చెప్పుకోలేని విషయాలు కూడా మన దోస్తులతో చెప్పుకుంటాం. అందుకే అంటారు స్నేహితుడు అనేవారు దేవుడు ఇచ్చిన గొప్పవరం అని. ఇక స్నేహానికి ఆస్తులు అవసరం లేదు, భాష కూడా అవసరం లేదు ఇవన్నీ లేకుండా మన జీవితంలోకి వచ్చి మనకు తోడు నీడగా ఉంటారు ఫ్రెండ్స్. మనం ఎన్నో విషయాలను వారి నుంచి తెలుసుకుంటాం. అందుకే ఓ మహకవి అన్నాడు, ఒక మంచి పుస్తకం వంద మంది స్నేహితులతో సమానం, అలాగే ఒక మంచి స్నేహితుడు గ్రంథాలయంతో సమానం. దీని బట్టే మనం స్నేహం గొప్పతనం తెలుసుకోవచ్చు.

స్నేహితుల దినోత్సవం ఎందుకు జరుపుకుంటారంటే?

ప్రతి నెల ఆగస్టు మొదటి ఆదివారం ఈ స్నేహితుల దినోత్సవం జరుపుకుంటాం. అయితే మొదట ఈ స్నేహితుల దినోత్సవం 1919లో అమెరికాలో గ్రీటింగ్ కార్ట్స్ పరిశ్రమను నిర్వహించే హాల్ మార్క్ కార్ట్స్ అనే వ్యక్తిలో మొదలైన ఆలోచనే ఈ స్నేహితుల దినోత్సవం. తర్వాత 1958 జూలై 20న పెరుగ్వే పట్టణంలో డాక్టర్ ఆర్టేమియా బ్రాకో స్నేహితుల విందు సమయంలో ఈ దినోత్సవాన్ని ప్రతి పాదించారు. యూఎస్ జనరల్ అసెంబ్లీలో జూలై 30ని అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం గా ప్రకటించింది. ఇక తర్వాత నుంచి చాలా దేశాలు ఈ వేడుకలు జరుపుకుంటున్నాయి.

Tags:    

Similar News