వర్షం పడే ముందు ఎక్కువ ఉక్కపోత వస్తుంటుంది? ఎందుకో ఆలోచించారా?

ప్రస్తుతం వర్షాకాలం మొదలు అయ్యింది. ఎండ వేడితో సతమతం అయిన ప్రజలకు ఈ చిరుజల్లు కాస్త ఉపశమనాన్ని ఇస్తున్నాయనే చెప్పాలి. ఇక ఈ సంవత్సరం కాస్త త్వరగా వర్షాలు కురుస్తున్నాయి. మే చివరి వారం నుంచే తేలికపాటి చిరుజల్లులు కురుస్తున్నాయి.

Update: 2024-06-09 09:36 GMT

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం వర్షాకాలం మొదలు అయ్యింది. ఎండ వేడితో సతమతం అయిన ప్రజలకు ఈ చిరుజల్లు కాస్త ఉపశమనాన్ని ఇస్తున్నాయనే చెప్పాలి. ఇక ఈ సంవత్సరం కాస్త త్వరగా వర్షాలు కురుస్తున్నాయి. మే చివరి వారం నుంచే తేలికపాటి చిరుజల్లులు కురుస్తున్నాయి. దీంతో రైతులు ఆనందంగా తమ పొలం పనులు మొదలు పెట్టారు. మరీ ముఖ్యంగా ఈ మూడు నాలుగు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడటంతో రైతులు విత్తనాలు నాటుతూ.. పొలం సాగు విధానంపై ఫోకస్ చేశారు.

అయితే మీరు ఎప్పుడైనా గమనించారా? చాలా వరకు ఈరోజు చాలా ఉక్కపోతగా ఉంది. తప్పనిసరిగా కొద్ది సేపటిలో వర్షం పడుతుందని, ఈ రోజు ఈవినింగ్ వరకు వర్షం వస్తుందని మన పెద్దవారు అంటుంటారు. చాలా సందర్భాల్లో అలానే జరుగుతుంది. అంతే కాకుండా మీరు కరెక్ట్‌గా ఆలోచిస్తే వర్షం రావడానికి ముందు తీవ్రంగా ఉక్కపోత వస్తుంటుంది. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో చాలా మందికి తెలియదు. కాగా, ప్రస్తుతం దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. అసలు విషయంలోకి వెళ్లితే.. అయితే వర్షం పడే ముందు వాతావరణంలో చెమ్మ(humidity) అనేది విపరీతంగా పెరుగుతుందంట. ఇది మన శరీరంలోని ఉష్ణోగ్రతను కూడా పెంచుతుంది. ఆ వేడిని తగ్గించడానికి ఉక్కపోత సహకరిస్తుంది. దీంతో మనకు తీవ్రస్థాయిలో ఉక్కపోత వస్తుందంట. దీని బట్టి మనం కొద్ది సేపటిలో వర్షం పడుతుందని అర్థం చేసుకోవచ్చు అంటున్నారు కొందరు.( నోట్ : ఇది ఇంటర్నెట్ సమాచారం మేరకు మాత్రమే ఇవ్వబడినది. దిశ దీనిని ధృవీకరించలేదు)


Similar News