GONGURA: లివర్ ఆరోగ్యాన్ని పెంచుతోన్న అందరికీ ఇష్టమైన ఆకుకూర..!!
సాధారణంగా గోంగూర అంటే చాలా మంది ఇష్టపడుతారు.
దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా గోంగూర(Gongura) అంటే చాలా మంది ఇష్టపడుతారు. గోంగూర రుచిలో మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. గోంగూరలో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి 1, విటమిన్ బి2 , విటమిన్ బి 9 పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా దీనిలో మెగ్నీషియం, (Magnesium), పొటాషియం(Potassium)ఐరన్, రైబోఫ్లేవిన్(Riboflavin), కాల్షియం, ఫాస్పరస్, కెరోటిన్‌లు ఉంటాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. కాగా వారంలో రెండు సార్లైనా గోంగూర తింటే హెల్త్ కు ఎంతో మంచిది అంటున్నారు నిపుణులు. గోంగూర ఆకులు ఆరోగ్యకరమైన చర్మం(skin) అండ్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. గోంగూర తింటే క్యాన్సర్(Cancer) కణాల పెరుగుదల అదుపులో ఉంటుంది. ఎముకలను స్ట్రాంగ్‌గా ఉంచడంలో మేలు చేస్తుంది. హైబీపీని తగ్గించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా లివర్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. గోంగూర చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో తోడ్పడుతుంది.
గోంగూర ఆకుల్లో విటమిన్ సి రోగనిరోధక వ్యవస్థ(immune system)కు అవసరమైన పోషకం. ఈ ఆకు కూరలో ఉండే విటమిన్ సి శరీరం ఇన్ఫెక్షన్, వ్యాధులతో పోరాడటానికి మేలు చేస్తుంది. గోంగూర తింటే క్యాన్సర్ కణాల పెరుగుదల అదుపులో ఉంటుంది. ఎముకలను స్ట్రాంగ్‌గా ఉంచడంలో మేలు చేస్తుంది. గోంగూర శరీరంలో మంటను తగ్గిస్తుంది. గుండె జబ్బుల్ని, ఆర్థరైటిస్(Arthritis), క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో పోరాడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిల( Sugar levels)ను తగ్గించడంలో మేలు చేస్తుంది. దీనిలోని ఫైబర్ రక్తప్రవాహంలోకి చక్కెర శోషణను నెమ్మదిస్తుంది. దీంతో షుగర్ లెవల్స్ పెరగకుండా నిరోధిస్తుంది. అంతేకాకుండా బరువు తగ్గడాన్ని(Weight loss) ప్రోత్సహిస్తుంది. మెరుగైన జీవక్రియను అందిస్తుంది.