Today Weather Update: తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన..!!

నేడు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

Update: 2024-10-25 02:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: నేడు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న 24 గంటల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు. నేడు ద్రోణి ప్రభావంతో ఆదిలాబాద్, మంచిర్యాల,కొమురం భీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, నిర్మల్, కరీంనగర్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, ఖమ్మం, జనగాం, సిద్ధిపేట,హనుమకొండ, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అలాగే ఏపీలో కూడా పలు ప్రాంతాల్లో చిరుజల్లులతో కూడిన వర్షాలు పడనున్నాయని వెల్లడించింది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

హైద్రాబాద్‌లో ఉష్ణోగ్రత గమనించినట్లైతే ... గరిష్ఠ ఉష్ణోగ్రత 24 డిగ్రీలు ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.

విజయవాడలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 27 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.

విశాఖపట్నంలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం..27 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.

వరంగల్ ఉష్ణోగ్రత గమనించినట్లైతే.. మాగ్జిమం 26 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.

Tags:    

Similar News