Ghost Movies: దెయ్యాల సినిమాలు చూసేటప్పుడే భయం ఎందుకు కలుగుతుంది.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే?
మనలో కొంతమంది దెయ్యాల సినిమాలు చూసేందుకు ఇష్టపడతారు.
దిశ, ఫీచర్స్ : మనలో కొంతమంది దెయ్యాల సినిమాలు చూసేందుకు ఇష్టపడతారు. కానీ ఇంకో వైపు భయపడుతూనే ఉంటారు. మరి కొందరైతే చూస్తుండగానే వణికిపోతుంటారు. సెన్సిటివ్ పీపుల్స్ అయితే హార్ట్ బీట్ ఎక్కువయి శరీరం మొత్తం చెమటలు పడతాయి. భయానక సీన్స్ ని అలాగే చూస్తున్నపుడు వెన్నులో వణుకు మొదలవుతుంది దీంతో చూసే సినిమాని కూడా మధ్యలోనే ఆపేస్తాం..
అసలు హారర్ సినిమాలు చూసేటప్పుడే మనం భయపడుతుంటాము.. ఇలా ఎందుకు అవుతుందో ఎప్పుడైనా దీని గురించే ఆలోచించారా.. దీని వెనుక శాస్త్రీయ కోణం ఉందా.. అనే సందేహం అందరికి వచ్చే ఉంటుంది. దాని గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..
భయంకర సీన్స్ చూసేటప్పుడు మన మెదడు మనకి తెలియకుండానేవీ ఒత్తిడికి గురవుతుంది. అప్పుడు అడ్రినలిన్ హార్మోన్ యాక్టీవ్ అవుతుంది. ఏదైనా ప్రమాదం జరుగుతుందన్నప్పుడు.. ఆ టైం లో మనం అక్కడ నిలబడాలా.. పారిపోవాలా అనే సందేశాన్ని శరీరానికి చేరవేస్తుంది. ఈ హార్మోన్‌ను ఎమర్జెన్సీ హార్మోన్ అని కూడా పిలుస్తారు. భయం వంటి పరిస్థితులు వచ్చినప్పుడు శరీరాన్ని మంచిగా ఉంచడానికి గుండె కొట్టుకోవడం పెరుగుతుంది. దెయ్యం మూవీ చూస్తున్నప్పుడు ఒత్తిడికి గురైనప్పుడు నోరు కూడా పొడిగా అవుతుంది. అడ్రినలిన్ హార్మోన్ వాటిని అదుపు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.