Stress relief : ఆందోళన వెంటాడుతోందా..? మీలో ఉత్సాహం నింపే సింపుల్ టిప్స్ ఇదిగో..!

Stress relief : ఆందోళన వెంటాడుతోందా..? మీలో ఉత్సాహం నింపే సింపుల్ టిప్స్ ఇదిగో..!

Update: 2024-10-26 13:24 GMT

దిశ, ఫీచర్స్ : ప్రతీ రోజు జీవితం కొత్తగానే అనిపిస్తుంది. సమస్యలు, సవాళ్లు, ఒత్తిళ్లు సహజమే. తమ తమ అనుభవాలను, ఆసక్తులను బట్టి కొందరు పాజిటివ్‌గా, మరి కొందరు నెగెటివ్‌గా ఫీల్ అవుతుంటారు. ఇదంతా పక్కన పెడితే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నా ఉల్లాసంగా, ఉత్సాహంగా గడపడం మీ చేతుల్లోనే ఉంటుంది అంటున్నారు నిపుణులు. అయితే మీ రోజువారీ దినచర్యలను ఉత్సాహంగా మార్చే టిప్స్ కొన్ని ఉన్నాయి అంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం.

* క్రమం తప్పకుండా వ్యాయామం : మిమ్మల్ని ఆరోగ్యంగా, ఆనందంగా, ఉత్సాహంగా ఉంచగలిగే దినచర్యల్లో క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం కూడా ఒకటి. కాబట్టి స్విమ్మింగ్, వాకింగ్, యోగా వంటివి క్రమం తప్పకుండా చేయండి. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా డైలీ 10 నుంచి 15 నిమిషాలైనా వాకింగ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

* యోగా : మీరు ఉదయం లేచింది మొదలు పొద్దు పోయే వరకు రకరకాల పనులు చేస్తుంటారు. అయితే మీరు మరింత ఉత్సాహంతో ఉండాలంటే క్రమం తప్పకుండా ప్రతి రోజూ కొంతసేపు యోగా లేదా ధ్యానం వంటివి చేయాలి. దీంతో మీలో ఒత్తిడి తగ్గి ప్రశాంతత చేకూరుతుంది. భావోద్వేగాలు నియంత్రణలో ఉంటాయి.

* నిశ్శబ్దం : చాలా మంది నిశ్శబ్దాన్ని అమాయకత్వం అనుకుంటారు కానీ అదొక పవర్ ఫుల్ వెపన్ లాంటిదని నిపుణులు చెప్తుంటారు. అనేక సమస్యలకు పరిష్కారాన్ని చూపడమే కాకుండా మీలోని ఒత్తిడి, ఆందోళనలు వంటివి దూరం చేస్తుంది. కాబట్టి మీరు రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే ప్రతిరోజూ ఉదయం కాసేపు ఎవరూలేని ప్రదేశంలో నిశ్శబ్దంగా ప్రకృతిని ఆస్వాదించండి.

*డైరీ రాయడం : మీ ఐడియాలు, సమస్యలు ఏవైనా కావచ్చు వాటిని డైరీలో రాయడం అలవాటు చేసుకుంటే అవసరం అయినప్పుడు చెక్ చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవచ్చు. పొరపాట్లు దిద్దుకొని ముందుకు సాగవచ్చు. పనికి వచ్చే అంశాలుంటే మరోసారి గుర్తు చేసుకొని ఉత్సాహం పొందవచ్చు. కాబట్టి మీ ప్రణాళికలు డైరీలో రాయడం మీలో ఆనందానికి, రెట్టింపు ఉత్సాహానికి కారణం అవుతుంది.

* క్వాలిటీ స్లీప్ : తగినంత నిద్రలేకపోతే ఆ రోజంతా డల్‌గా ఉంటారు. ఐడియాలు సరిగ్గా తట్టవు. కాబట్టి మీరు ఉత్సాహంగా పనిచేయాలంటే రోజూ కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. నాణ్యమైన నిద్ర ద్వారా మీ మెదడు పనితీరు మరింత మెరుగవుతుంది.

*సానుకూల ఆలోచన : సానుకూల ఆలోచనలతో ఉండటం మీలో ఆనందాన్నే కాదు, ఉత్సాహాన్ని నింపుతుందని నిపుణులు చెప్తున్నారు. సమ్యలు అందరికీ ఉంటాయి. కానీ ప్రతీ సందర్భంలో వాటిని తల్చుకుంటూ కూర్చుంటే వెనుకబడతారు. ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు అవతలి వారికి కేవలం మీ ప్రాబ్లమ్స్ గురించే చెప్తూ ఉంటే ఇబ్బందిగా ఫీలవుతారు. కాబట్టి పాజిటివ్‌గా మాట్లాడండి. దీంతో మీపట్ల అవతలి వ్యక్తుల్లో సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. మీలో ఉత్సాహానికి కారణం అవుతుంది.

* కృతజ్ఞతగా ఉండండి : మీరు సంతోషంగా ఉండాలంటే మీరున్న పరిస్థితులు, వ్యక్తులపట్ల కృతజ్ఞతా భావాన్ని కూడా కలిగి ఉండాలంటున్నారు నిపుణులు. మీకు మేలు చేసిన వ్యక్తులను, పరిసరాలను గుర్తుంచుకోండి. సందర్భం వచ్చినప్పుడు గుర్తు చేసుకోవడం కృతజ్ఞతగా ఫీలవడం మీలో రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తుందని నిపుణులు చెప్తున్నారు. 

Tags:    

Similar News