అసలు రాఖీ ఆడవారే ఎందుకు కడుతారో తెలుసా ?

దిశ, వెబ్‌డెస్క్ : రాఖీ పండుగా సోదరులకు, సోదరీమణులకు ఎంతో ప్రత్యేకమైన పండుగ.శ్రావణ మాసం వచ్చిందంటే చాలు చాలా మంది రాఖీ పండుగ ఎప్పుడు అనే చూస్తుంటారు.

Update: 2022-08-11 02:21 GMT

దిశ, వెబ్‌డెస్క్ : రాఖీ పండుగా సోదరులకు, సోదరీమణులకు ఎంతో ప్రత్యేకమైన పండుగ.శ్రావణ మాసం వచ్చిందంటే చాలు చాలా మంది రాఖీ పండుగ ఎప్పుడు అనే చూస్తుంటారు. ఇక ఈరోజు ఉదయాన్నే తల స్నానం చేసి, గుడికి వెళ్లి పూజ చేసుకుని.. తమ అన్నదమ్ములకు అక్కచెల్లెళ్లు రాఖీ కడుతారు. ప్రతి సోదరుడు తమ పనుల్లో విజయం సాధించాలని కోరుతూ రాఖీ కడుతారు. అయితే ఎక్కడైనా ఆడవాల్లే రాఖీ కడుతుంటారు. ఇలా ఆడవాల్లే రాఖీ కట్టడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయంటున్నారు పండితులు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

పురాణాల ప్రకారం.. దేవతలకు, రాక్షసులకు సుమారు పుష్కర కాలం పాటు యుద్దం జరిగిందంటారు. అయితే ఆసమయంలో ఇంద్రుడు నిస్సాహాయ స్థితిలో పడిపోవడంతో ఆయన భార్య అయిన శచీదేవి ఇద్రున్ని చూసి.. భయంతో విష్ణుదేవుని వద్దకు వెళ్లి నాభర్తను రక్షించాలని ఓ పవిత్రమైన పత్తి దారాన్ని విష్ణు దేవుడి చేతికి కడుతుందంట. అప్పుడు విష్ణు దేవుడు ఇంద్రున్ని కాపాడుతాడు. అలా ఆ కాలం నుంచి శచీదేవి వలన రాఖీ పండుగ అమలులోకి వచ్చింది. అందుకే ఆడవారే రాఖీ కడుతారంట.

రక్షా బంధన్.. అన్నాచెల్లెళ్లకేనా? 


Similar News