తొందరపాటులో తడిగా ఉన్న లోదుస్తులు వేసుకుంటే ఏం జరుగుతుంది?

వర్షాకాలంలో కొన్నిసార్లు బట్టలు వాష్ చేసినా చల్లటి వెదర్ వల్ల ఆరని సందర్భాలు చాలానే ఉంటాయి. దీంతో హడావిడిగా బయటకు వెళ్లేవారు, ఉద్యోగస్తులు కొంచెం తడిగా ఉన్నా సరే ఆ దుస్తులను అలాగే వేసుకొని వెళ్తుంటారు. అయితే స్త్రీ, పురుషులు ఎవరైనా సరే ఇలా తడి లోదుస్తులను వేసుకుంటే కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అవేంటో చూద్దాం.

Update: 2024-06-08 10:04 GMT

దిశ, ఫీచర్స్ : వర్షాకాలంలో కొన్నిసార్లు బట్టలు వాష్ చేసినా చల్లటి వెదర్ వల్ల ఆరని సందర్భాలు చాలానే ఉంటాయి. దీంతో హడావిడిగా బయటకు వెళ్లేవారు, ఉద్యోగస్తులు కొంచెం తడిగా ఉన్నా సరే ఆ దుస్తులను అలాగే వేసుకొని వెళ్తుంటారు. అయితే స్త్రీ, పురుషులు ఎవరైనా సరే ఇలా తడి లోదుస్తులను వేసుకుంటే కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అవేంటో చూద్దాం.

నిజానికి లోదుస్తులు ఎంత శుభ్రంగా ఉంటే ఆరోగ్యానికి అంత మంచిది. మురికి, టైట్‌గా ఉండే అండర్‌ వేర్‌లను వేసుకున్నాలేనిపోని సమస్యలు కొనితెచ్చుకున్నట్టే. తడిగా ఉంటే ఇంకా డేంజర్. ఎందుకంటే తడిగా ఉన్నప్పుడు వేసుకునే అండర్ వేర్లపై బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. ఇది ఇన్ఫక్షన్ కలిగించడంవల్ల ప్రైవేటు పార్టులో దురద, మంట, చికాకు వంటి ప్రాబ్లమ్స్ తలెత్తుతాయి. స్త్రీలకు ఈ రిస్క్ మరింత ఎక్కువ. తడి అండర్ వేర్లను యూజ్ చేయడంవల్ల ఏర్పడే బ్యాక్టీరియా సంక్రమణ యూరినల్ ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు. 


Similar News