అందంగా అవ్వాలనుకుంటున్నారా!.. ఈ ఒక్క చిట్కాతో శ్రీ లీల వంటి గ్లామర్ మీ సొంతం..

బేసిక్‌గా ఆడవారికి అందంగా ఉండటం అంటే చాలా ఇష్టం. కానీ రోజూ జర్నీ చేయడం, టెన్షన్ వంటి కారణాల వల్ల మొహం మీద మచ్చలు, మొటిమలు, స్కిన్ డల్ అయిపోతుంది.

Update: 2024-07-18 08:25 GMT

దిశ, ఫీచర్స్: బేసిక్‌గా ఆడవారికి అందంగా ఉండటం అంటే చాలా ఇష్టం. కానీ రోజూ జర్నీ చేయడం, టెన్షన్ వంటి కారణాల వల్ల మొహం మీద మచ్చలు, మొటిమలు, స్కిన్ డల్ అయిపోతుంది. మళ్లీ మెరిసే చర్మం రావడం కోసం రకరకాల క్రీమ్స్, బ్యూటీ పార్లల్ చుట్టూ తిరుగుతూ వేలకు వేలు తగిలేస్తు ఉంటారు. అయినా కానీ రిజల్ట్స్ మాత్రం అంతంత మాత్రమే. కానీ ఇప్పుడు నేను చెప్పే చిట్కాతో మీ మోము నిగనిగలాడటమే కాకుండా మీరు మరింత గ్లామరస్‌గా కూడా కనిపిస్తారు. దీని కోసం కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఏంటో మనం ఇప్పుడు చూద్దాం..

దీనిని మన ఇంట్లో ఉండే సహజసిద్ధమైన పదార్థాలతో సులభంగా తగ్గించుకోవచ్చు. చాలా తక్కువ ఖర్చుతో అందమైన చర్మాన్ని పొందవచ్చు. కాస్త ఓపిక సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది.

కావలసిన పదార్థాలు:

1) టమాటా

2) తేనె

3) కస్తూరి పసుపు

తయారీ విధానం:

దీని కోసం ముందుగా ఒక బౌల్లో అర చెక్క టమాటా రసం ఒక స్పూన్ తేనె , పావు స్పూన్ కస్తూరి పసుపు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పావుగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే మొటిమలు, నల్లటి మచ్చలు అన్ని తొలగిపోయి ముఖం కాంతివంతంగా అందంగా మెరుస్తుంది. ఈ చిట్కా కి ఉపయోగించిన అన్ని ఇంగ్రిడియంట్స్ మన ఇంట్లో సులభంగా అందుబాటులో ఉండేవే. కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది.

టమాట:

*టమాటాలో ఉండే విటమిన్ సి చర్మ రంగు మెరుగుపడటంలో మేలు చేస్తుంది. దీన్ని ఉపయోగించడం వల్ల ముఖంపై మచ్చలు, మొటిమలు వంటి సమస్యలన్నీ దూరం అవుతాయి.

తేనే:

*తేనేను ఉపయోగించడం వల్ల చర్మంపై ముడతలు తగ్గుతాయి. ముఖం కాంతివంతంగా మారుతుంది.

పసుపు:

*పసుపులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఫంగల్ గుణాలు సమృద్ధిగా ఉండటం వల్ల ముఖంపై మొటిమలు పోగొట్టడానికి సహాయపడుతుంది. అలాగే ముఖంలో జిడ్డును తొలిగిస్తుంది.

నోట్: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే దీనిని అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు సంబంధించి ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

Tags:    

Similar News