Sunita Williams: వావ్.. సునీతకు డాల్ఫిన్లు ఎలా వెల్కమ్ చెప్పాయో చూడండి!
Sunita Williams: దాదాపు 9 నెలల తర్వాత ఎట్టకేలకు భూమిమీదకు చేరుకున్నారు వ్యోమగామి సునీతా విలియమ్స్.

దిశ, వెబ్‌డెస్క్: Sunita Williams: దాదాపు 9 నెలల తర్వాత ఎట్టకేలకు భూమిమీదకు చేరుకున్నారు వ్యోమగామి సునీతా విలియమ్స్. ఆమెతోపాటు మరో ముగ్గురితో భూమికి బయలుదేరిన స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ బుధవారం తెల్లవారుజామున ఫ్లోరిడా తీరంలో దిగింది. ఆ సమయంలో ఈ వ్యోమనౌక చుట్టూ డాల్ఫిన్లు కలియదిరిగిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సముద్ర జలాల్లో దిగిన క్రూ డ్రాగన్ రికవరీ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ఆ వ్యోమనౌక చుట్టూ అధిక సంఖ్యలో డాల్ఫిన్లు చేరి సునీతాకు వెల్కమ్ చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.
కాగా 400కిలోమీటర్ల ఎత్తులో ఐఎస్ఎస్ లో వ్యోమగాములు భారరహిత స్థితిలో తెలియాడటం చూడటానికి సరదాగానే అనిపించినా గురుత్వాకర్షణ లేమి వల్ల దీర్ఘకాల రోదసియాత్రికుల ఆరోగ్యంపై మాత్రం తీవ్ర ప్రభావం పడుతుంది. ఎముకలు, కండరాల సాంద్రత తగ్గిపోవడం వంటి సమస్యలు ఎదురుఅవుతాయి . దీనికి తోడు భూమికి మీదకు తిరిగి వచ్చాక గురుత్వాకర్షణ శక్తికి వారు తిరిగి అలవాటుపడటం అంత ఈజీ కాదు. ఈ క్రమంలోనే వారు నిలబడటం, చూపును స్థిరంగా ఉంచడం, నడక, పక్కకు తిరగడం వంటి చర్యల్లో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అయితే సునీతా విలియమ్స్, ఇతర వ్యోమగాములుకు భూమిపై సాధారణంగా నడవటానికి కొన్ని వారాల సమయం పడుతుంది.
Read More..
ఆమె సాహసం భారతావనికి గర్వకారణం.. సునీతా విలియమ్స్ రాకపై మంత్రి కొండా సురేఖ