Kitchen Tips : వీటిని ఎక్కువగా ఫ్రిజ్‌లో స్టోర్ చేయకూడదు..!

Kitchen Tips : వీటిని ఎక్కువగా ఫ్రిజ్‌లో స్టోర్ చేయకూడదు..!

Update: 2025-01-02 14:25 GMT

దిశ, ఫీచర్స్ : కూరగాయలు, వివిధ ఆహారాలు ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు ఫ్రిజ్‌లో పెడుతుంటారు.  తాజాగా ఉండేందుకు ఆకు కూరలను కూడా అందులో పెడుతుంటారు. అయితే కొన్ని రకాల కూరగాయలు ఫ్రిజ్‌లో పెట్టకూడదు అంటున్నారు నిపుణులు. అలాంటివి ఏవి? ఫ్రిజ్‌లో పెట్టడంవల్ల జరిగే నష్టాలేమిటో చూద్దాం.

*గ్రీన్ వెజిటేబుల్స్ : వివిధ ఆకుకూరలు, కూరగాయలు సీజన్లతో సంబంధం లేకుండా మార్కెట్ నుంచి తీసుకు వచ్చాక సహజంగానే ఫ్రిజ్‌లో పెడుతుంటారు. అయితే 12 గంటలకంటే ఎక్కువ సమయం వీటిని ఫ్రిజ్‌లో పెడితే వాటిలోని నేచురల్ టేస్ట్, పోషకాలు తగ్గిపోయే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. కాబట్టి ఎప్పటికప్పుడు తెచ్చి వండుకుకోవడమే బెటర్.

*ఉల్లి పాయలు, వెల్లుల్లి : ఏ కూర వండినా వీటిని తప్పక వాడుతుంటాం. అయితే ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటివి కూడా కొందరు అధిక మొత్తంలో కొనుగోలు చేస్తుంటారు. అయితే వీటిని ఫ్రిజ్‌లో మాత్రం స్టోర్ చేయకూడదు. అలా చేస్తే ఇవి మొలకెత్తుతాయి. పైగా ఫంగస్ పెరిగి వాటి రుచి తగ్గిపోతుంది.

* అల్లం పేస్ట్ : కామన్‌గా ప్రతీ ఇంట్లో దీనిని వాడుతుంటారు. ఇది కూరల్లో రుచిని పెంచడమే కాకుండా దానిలోని ఔషధ గుణాల కారణంగా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే అల్లం పేస్ట్‌ను ఫ్రిజ్‌లో నిల్వ చేయకూడదు. ఎక్కువ రోజులు స్టోర్ చేయడంవల్ల బూజు పడుతుంది.

*ఆలుగడ్డలు : సీజన్ ఏదైనా వీటిని ఫ్రిజ్‌లో పెట్టడం మంచిది కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే అవి మొలకెత్తుతాయి. పైగా ఫ్రిజ్‌లో నిల్వచేయడం వల్ల ఆలు గడ్డల్లోని పిండి పదార్థం చక్కెరగా మారుతుంది. ఇది డయాబెటిస్ రోగలకు మంచిది కాదు.

*టమాటాలు : ఒక విధంగా చెప్పాలంటే ప్రతీ ఇంట్లో వీటిని ఫ్రిజ్‌లో పెడుతుంటారు. అయితే ఎక్కువ రోజులు స్టోర్ చేస్తే వాటి రుచి మారిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు నశిస్తాయి. కాబట్టి ఒకటీ రెండు రోజులకంటే ఎక్కువగా టమాటోలను ఫ్రిజ్‌లో పెట్టకూడదు. 

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు. 

Read More ....

Kitchen Tips : లవంగాలను ఇలా వాడితే చాలు.. దెబ్బకు ఎలుకలు పరార్!





Tags:    

Similar News