దుస్తుల్లో అదోరకమైన స్మెల్.. రాకుండా ఏం చేయాలంటే..

ఎండలో తిరిగినప్పుడో, ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడో శరీరానికి చెమటలు పట్టడం, స్మెల్ రావడం సహజమే. కానీ కూల్ వెదర్‌లోనూ కొందరికి అండర్ ఆర్మ్స్ చెమటలు పడుతుంటాయి.

Update: 2024-07-13 09:03 GMT

దిశ, ఫీచర్స్ : ఎండలో తిరిగినప్పుడో, ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడో శరీరానికి చెమటలు పట్టడం, స్మెల్ రావడం సహజమే. కానీ కూల్ వెదర్‌లోనూ కొందరికి అండర్ ఆర్మ్స్ చెమటలు పడుతుంటాయి. దీనివల్ల దుస్తుల్లో అదో రకమైన వాసనతో ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా టైట్‌ ఫిట్స్ ధరించేవారిలో ఈ సమస్య అధికంగా ఉంటుంది. వాసన కారణంగా నలుగురిలో తిరడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు కొందరు. అయితే ఈ సమస్యకు చక్కటి పరిష్కారం ఉందంటున్నారు నిపుణులు. పైసా ఖర్చులేకుండా చెమట వాసనను పోగొట్టుకోవచ్చని చెప్తున్నారు. అదెలాగో చూద్దాం.

* నిమ్మకాయ, బేకింగ్ సోడా : విటమిన్ సి కలిగి ఉండటంవల్ల నిమ్మకాయ ఆరోగ్యానికి మంచిదనే విషయం తెలిసిందే. కానీ దుస్తుల క్లీనింగ్‌లోనూ, దుర్వాసన పోగొట్టడంలోనూ ఇది అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు చెప్తున్నారు. అందుకోసం బట్టలు ఉతికే నీటిలో కాసింత నిమ్మరసం కలిపితే చెమట వాసన రాకుండా ఉంటుందట. దీంతోపాటు బేకింగ్ సోడా కూడా మంచి క్లీనర్‌గా యూజ్ అవుతుంది. బట్టలు ఉతికే నీటిలో కొద్దిగా మిక్స్ చేయడంవల్ల దుస్తుల్లో, వాటిని ధరించిన తర్వాత శరీరంలో చెమట వచ్చినప్పటికీ వాసన రాకుండా ఉంటుంది. ఒక బకెట్‌లో సాధారణ స్థాయి వేడినీటిని తీసుకొని, అందులో రెండు టీ స్పూన్ల వెనిగర్ వేసి, దుస్తులను కాసేపు నానబెట్టడంవల్ల కూడా వాసన రాకుండా ఉంటాయి.

అలాగే కొందరు క్లాతింగ్ కలర్ వెలసిపోతుందని ఎండలో ఆరబెట్టకుండా ఉంటారు. కానీ ఎండలో ఆరబెట్టడమే మంచిది అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇలా చేయడంవల్ల దుస్తులపై ఉండే హానికారక సూక్ష్మ జీవులు నశిస్తాయి. అలాగే దుర్వాసన రాకుండా ఉంటాయి. మరో విషయం ఏంటంటే.. కొందరు బట్టలు ఉతికే ముందు బకెట్లో నీళ్లు తీసుకొని, అందులో సర్ఫ్ కలిపి గంటల తరబడి నానబెడుతుంటారు. కానీ దీనివల్ల దుర్వాసన వస్తుంది. కాబట్టి ఎక్కువసేపు నానబెట్ట కూడదని నిపుణులు చెప్తున్నారు.

* గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు. 

Tags:    

Similar News