HAIR - SUPER FOOD : జుట్టు రాలుతోందా? ఎన్ని షాంపూలు ట్రై చేసినా ఫలితం లేదు కదా.. ఈ సూపర్ ఫుడ్‌తో బెస్ట్ రిజల్ట్స్

ప్రజెంట్ జుట్టు రాలడం సమస్య దాదాపు అందరినీ వేధిస్తుంది. అందుకే మార్కెట్ లోకి లెక్కకు మించిన షాంపూలు వచ్చేశాయి. కానీ వాటిని వదిలినా ఫలితం అంతంత మాత్రమే. కారణం హెయిర్ ఫాల్ అనేది బయట నుంచి తీసుకునే షాంపూలు

Update: 2024-08-12 04:51 GMT

దిశ, ఫీచర్స్: ప్రజెంట్ జుట్టు రాలడం సమస్య దాదాపు అందరినీ వేధిస్తుంది. అందుకే మార్కెట్ లోకి లెక్కకు మించిన షాంపూలు వచ్చేశాయి. కానీ వాటిని వదిలినా ఫలితం అంతంత మాత్రమే. కారణం హెయిర్ ఫాల్ అనేది బయట నుంచి తీసుకునే షాంపూలు లేదా ఇతర ప్రొడక్ట్స్ వల్ల కాకుండా మంచి ఆహారం తీసుకోవడం కారణంగా తగ్గిపోతుందని చెప్తున్నారు నిపుణులు. ఎలాంటి సూపర్ ఫుడ్ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలో సూచిస్తున్నారు.

  • పాలకూర : ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ సి, ఫోలేట్‌తో నిండిన బచ్చలికూర స్కాల్ప్‌ను పోషించడంలో సహాయపడుతుంది. జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది.
  • స్వీట్ పొటాటోస్ : ఇందులో బీటా-కెరోటిన్‌ పుష్కలంగా ఉంటుంది, దీన్ని శరీరం విటమిన్ ఎగా మార్చుకుంటుంది, చిలగడదుంపలు ఆరోగ్యకరమైన స్కాల్ప్‌ను ప్రోత్సహిస్తాయి. జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.
  • చియా సీడ్స్ : ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉన్న చియా సీడ్స్ జుట్టుకు పోషణను అందించడంలో సహాయపడతాయి. పూర్తి స్కాల్ప్ ఆరోగ్యానికి తోడ్పడతాయి.
  • బాదం : విటమిన్ ఈ, మెగ్నీషియం, బయోటిన్‌తో నిండిన బాదం జుట్టు బలాన్ని మెరుగుపరుస్తుంది, హెయిర్ ఫాల్ నివారిస్తుంది.
  • బెర్రీస్ : స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి హెయిర్ ఫోలికల్స్ దెబ్బతినకుండా, కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడతాయి.

Read More..

Tiredness : తరచుగా అలసిపోతున్నారా?.. కారణం అదేనేమో! 

Tags:    

Similar News