మహిళలు నగ్నంగా దుక్కిదున్నే గ్రామం ఇదే.. ఇద్దరు అబ్బాయిలకు పెళ్లి కూడా! ఇదంతా దానికోసమే!!
మృగశిక కార్తే వచ్చిందంటే చాలు.. సాధారణ ప్రజలు, రైతులు ఎప్పుడు వర్షం పడుతుందా అని ఎదురుచూస్తుంటారు.
దిశ, వెబ్‌డెస్క్ : మృగశిక కార్తే వచ్చిందంటే చాలు.. సాధారణ ప్రజలు, రైతులు ఎప్పుడు వర్షం పడుతుందా అని ఎదురుచూస్తుంటారు. ఒక్కో ఏడాది వర్షం సమయానికి వచ్చినా ఒక్కోసారి కాస్త ఆలస్యంగా కురుస్తుంది. దీంతో హైరానా పడిపోయే ప్రజలు, రైతులు వర్షం పడేందుకు ఎన్నో పూజలు, వ్రతాలు చేస్తూ వింత వింత ఆచారాలను పాటిస్తుంటారు. ముఖ్యంగా మన భారతదేశంలో ఇలాంటి ఆచారాలను ఎక్కువగా పాటిస్తారు. మరి ఆ ఆచారాలు ఏంటి? ఏయే రాష్ట్రాల్లో ఏ విధంగా వరుణ పూజలు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం..!
1. అబ్బాయిలకు పెళ్లిళ్లు చేయడం : కర్ణాటక మాండ్య జిల్లాలోని గంగేనహళ్లి గ్రామంలో వర్షం కోసం ఇద్దరు అబ్బాయిలకు వివాహం జరిపిస్తారు. ఒక అబ్బాయిని వధువులా, మరో అబ్బాయిని వరుడిలా తయారు చేసి వివాహం జరిపిస్తారు. అంతేకాదు వింధు భోజనం కూడా పెడతారు.
2. వరుణ యజ్ఞం : పూర్వం వర్షం కురవడానికి వరుణయాగం చేసేవారు. ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాలలో వానలు కురవడానికి పండితులు వరుణ యజ్ఞం చేస్తారు. లేదా వరుణుడి నామాన్ని వెయ్యి సార్లు జపిస్తారట. మరికొన్ని ప్రాంతాల్లో పూజారులు నీటిలో మునిగి స్వామి వారి జపం చేస్తుంటారు. అలా చేయడం ద్వారా వరుణుడు కరుణిస్తాడని వారి నమ్మకం.
3. పొలాలను నగ్నంగా దున్నడం : వర్షాలు కురిసేందుకు పాటించే వింత ఆచారాల్లో ఇది కూడా ఒకటి. గ్రామాల్లో వర్షాలు కురవాలని ఉత్తర ప్రదేశ్‌లోని కొన్ని గ్రామాల మహిళలు నగ్నంగా పొలాన్ని దున్నుతారట. తమ పొలాల వద్దకు అర్థరాత్రి నగ్నంగా వెళ్లి పొలాన్ని సాగుచేస్తారట. ఇలా చేస్తే కచ్చితంగా వర్షాలు పడతాయని వారి నమ్మకం.
4. కప్పల పెళ్లిళ్లు చేయడం : అస్సాం, మహారాష్ట్ర, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వరుణదేవున్ని ప్రసన్నం చేయడానికి ఆడ, మగ కప్పలకు వివాహం జరిపిస్తారు. ఆ తరువాత గ్రామంలో ఊరేగిస్తూ గ్రామస్తులు ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకుంటారు. ఆ సంబరం ముగిసిన తరువాత కప్పలను నీటిలో వదిలేస్తారట. అయితే అస్సాంలో మాత్రం ఈ వివాహం జరిపించేందుకు ఏప్రిల్ 15న సెలవు కూడా ఇస్తారట. ఇలా చేయడం వల్ల వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని ఆయా ప్రాంత ప్రజల నమ్మకం.
5. గ్రామాలకు బహిష్కరణ, వనాల్లోనే జీవనం : వర్షాల కురవడం కోసం తెలంగాణలోని కొన్ని గ్రామాల ప్రజలు ఒక రోజంతా వనవాసం చేస్తారట. అడవిలోనే వంటలు చేసుకుని తిని సాయంత్రం ఇంటికి చేరుకుంటారట. ఇలా చేస్తే వరుణ దేవుడు సంతోషించి వర్షం కురిపిస్తాడని ప్రజల విశ్వాసం.
6. బురద చల్లి పడుకొని ఆకాశం వైపు చూస్తూ : ఉత్తర ప్రదేశ్‌లోని అలహాబాద్ సమీపంలోని నారీబారిలో వర్షాలు కురిసేందుకు చిన్నపిల్లలను బురదలో ఉంచుతారు. ఒళ్లంతా బురద రాసుకొని బురదలో పడుకుని ఆకాశం వైపు చూస్తూ ఉంటారట.
ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆచారాన్ని పాటిస్తూ వర్షాల కోసం ప్రజలు ఎదురు చూడటం పూర్వకాలం నుంచి పాటిస్తున్నారు. ఎక్కువగా కరువు నేలలు ఉన్న ప్రాంతాల్లో ఈ తరహ పూజలు చేస్తారు.
Read More: ఆ రాశుల అమ్మాయిలను చూస్తే అబ్బాయిలు ఫిదా..! ఇట్టే పడిపోవడం ఖాయం!!