తక్కువ బడ్జెట్ లో అదిరిపోయే నాలుగు DSLR కెమెరాలు ఇవే..

ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ చేసే వ్యక్తులు తాము స్వంత కెమెరాలను తీసుకోవాలని ఆశపడుతూ ఉంటారు.

Update: 2024-01-10 07:50 GMT

దిశ, ఫీచర్స్ : ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ చేసే వ్యక్తులు తాము స్వంత కెమెరాలను తీసుకోవాలని ఆశపడుతూ ఉంటారు. ఫోటోగ్రఫీ చేసేవారు కెమెరా కోసం ఇతరులను పదేపదే అడగడం, ఫోటోలు క్లిక్ చేయడం కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. కెమెరాలు చిటికెలో కొనగలిగేంత చౌకగా ఉండవు కదా. అలాంటి వారి కోసమే తక్కువ ధరలో వచ్చే డీఎస్ఎల్ఆర్ కెమెరాల గురించి తెలియజేస్తున్నాం. మీరు వీటిని ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో బంపర్ డిస్కౌంట్‌లతో సొంతం చేసుకోవచ్చు. ఈ కెమెరాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇంతకీ ఆ కెమెరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

కెనాన్ EOS 3000D..

ఈ కెమెరాను అమెజాన్‌లో కేవలం రూ. 35,990కే సొంతం చేసుకోవచ్చు. కోసం ఒకేసారి ధర చెల్లించలేని వారు ఈఎంఐలో కొనుగోలు చేయవచ్చు. నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. ప్రతి నెల ఈఎంఐ రూ. 1,620 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.

ఫీచర్స్

18 మెగాపిక్సెల్ ఏపీఎస్ - సీ -పరిమాణ సీఎంఓఎస్ సెన్సార్

DIGIC 4+ ఇమేజ్ ప్రాసెసర్

1 సెంటర్ క్రాస్-టైప్ ఏఎఫ్ పాయింట్‌తో 9 పాయింట్ ఏఫ్

16 జీబీ స్టోరేజ్

క్యారీ కేస్

Canon EOS 1500D 24.1 డిజిటల్ SLR కెమెరా

ఈ కెమెరాను అమెజాన్ లో అతి తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. మీరు ఈ కెమెరాను రూ.41,390కి కొనుగోలు చేయవచ్చు. పూర్తి పేమెంట్ చేయలేనివారు నో కాస్ట్ ఈఎంఐను ఎంచుకోవచ్చు. నెలవారీ ఈఎంఐ కేవలం రూ. 1,863 చెల్లించాల్సి ఉంటుంది.

ఫీచర్స్

సెన్సార్ : 24.1 ఎంపీతో ఏపీఎస్ - సీ, సీఎంఓఎస్

ISO : 100 - 6400

ఇమేజ్ ప్రాసెసర్ : 9 ఆటో ఫోకస్ పాయింట్‌లతో DIGIC 4+

కనెక్టివిటీ : వైఫై, ఎన్ఎఫ్సీ, బ్లూటూత్ కనెక్ట్ చేసుకునే అవకాశం.

లెన్స్ మౌంట్ : ఈ ఎఫ్ - ఎస్ మౌంట్

Nikon Z30 మిర్రర్‌లెస్ కెమెరా

ఈ కెమెరా ధర కేవలం రూ. 59,895 మాత్రమే. అమెజాన్ లో ఈ కెమెరాను 17 శాతం తగ్గింపు ధరతో కేవలం రూ. 49,990 కే సొంతం చేసుకోవచ్చు. ఈ కెమెరాను నో కాస్ట్ ఈఎంఐలో కూడా కొనుగోలు చేయవచ్చును. నెలవారీ ఈఎంఐ రూ. 2,250 మాత్రమే చెల్లించాలి.

Nikon D5600 డిజిటల్ కెమెరా

ఈ కెమెరాను కొనుగోలు చేయడానికి మీరు మీ బడ్జెట్‌ను కొద్దిగా పెంచుకోవాలి. ఈ కెమెరాను రూ. 57,550కి సొంతం చేసుకోవచ్చు. నో కాస్ట్ ఈఎంఐలో కూడా ఈ కెమెరాను కొనుగోలు చేయవచ్చు. నెలవారీ ఈఎంఐ రూ. 2,591 చెల్లించాల్సి ఉంటుంది.

Tags:    

Similar News