Uric acid: యూరిక్‌ యాసిడ్‌ తో బాధ పడుతున్నారా.. అయితే, ఈ నీటితో తగ్గించుకోండి!

ఎంతో మంది యూరిక్ యాసిడ్ తో బాధ పడుతున్నారు

Update: 2024-12-26 05:15 GMT

దిశ, వెబ్ డెస్క్ : మారుతున్న జీవనశైలిలో ఎంతో మంది యూరిక్ యాసిడ్ తో బాధ పడుతున్నారు. సాధారణంగా మూత్రపిండాలు యూరిక్ యాసిడ్ ను ఫిల్టర్ చేసి మూత్రం ద్వారా బయటకు పంపించేస్తాయి. మన శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరగడం వలన అనేక సమస్యలు వస్తాయి.

అయితే, ఈ సమస్యను ఇంటి చిట్కాతో తగ్గించవచ్చు. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించడానికి ఆహారం, జీవనశైలిని మెరుగుపరచుకోవాలి. దీనిని తగ్గించడంలో మెంతులు ముఖ్య పాత్ర పోషిస్తాయి. మెంతులలో ఫైబర్ . పుష్కలంగా ఉంటుంది. ఇది యూరిక్ యాసిడ్‌ను నియంత్రిస్తుంది.

ఇది కీళ్ల నొప్పులు, వాపులను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా, టాక్సిన్స్ ను తొలగించడంలో సహాయపడుతుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వలన జీర్ణవ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. బరువును కూడా తగ్గిస్తుంది. యూరిక్ యాసిడ్ స్థాయిలను నియంత్రించడానికి మెంతి టీని తీసుకోవచ్చు. దీ ఒక గ్లాసు వేడి నీటిని తీసుకుని దానిలో ఒక స్పూన్ మెంతి గింజలు వేసి మరిగించాలి. కొంత సేపటి తర్వాత ఒక కప్పులో వడపోసి వాటిని తాగాలి. దీన్ని రోజూ తీసుకోవడం వలన యూరిక్ యాసిడ్ అదుపులో ఉంటుంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘దిశ’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Tags:    

Similar News