వర్షాకాలంలో ఒళ్లు.. కీళ్ల నొప్పులు ఎక్కువ.. కారణం ఇదే

మిగతా సీజన్లతో పోలిస్తే ప్రజలు వర్షాకాలంలో ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

Update: 2024-07-17 13:01 GMT

దిశ, ఫీచర్స్ : మిగతా సీజన్లతో పోలిస్తే ప్రజలు వర్షాకాలంలో ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అయితే ఇందుకు ప్రత్యేక కారణాలు ఉన్నాయంటున్నారు. అయితే మిగతా సీజన్లతో పోలిస్తే వర్షాకాలంలో సహజంగానే వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. పరోక్షంగా ఇది సాధారణ వ్యక్తులతో పాటు అప్పటికే ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు ఉన్నవారిని మరింత ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. దీంతో కీళ్ల నొప్పులు పెరుగుతాయి. అంతేకాకుండా చల్లటి వెదర్ వల్ల చాలామంది నీరు తక్కువగా తాగుతుంటారు. మిగతా సీజన్లతో పోలిస్తే బాడీలో నీటిశాతం తగ్గుతుంది. ఇది కీళ్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీంతో కండరాల్లో చిన్నపాటి వాపు, కణజాలాలు ఉబ్బడం వంటివి సంభవిస్తాయి. ఈ పరిస్థితి కీళ్లు, ఒళ్లు నొప్పులకు దారితీస్తుందని నిపుణులు చెప్తున్నారు.  

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.  


Similar News