సోయా ఫుడ్స్‌తో తగ్గుతున్న గుండె జబ్బుల రిస్క్.. ఇంకా ఈ బెనిఫిట్స్ కూడా..

సోయాబీన్ ఆరోగ్యానికి మంచిదన్న విషయం తెలిసిందే. అయితే ఆహారంలో భాగంగా మనం వివిధ రూపాల్లో మనం యూజ్ చేస్తున్న దీని ఉత్పత్తులు గుండె జబ్బుల రిస్క్‌ను 17 శాతం తగ్గిస్తాయి.

Update: 2024-06-08 11:43 GMT

దిశ, ఫీచర్స్ : సోయాబీన్ ఆరోగ్యానికి మంచిదన్న విషయం తెలిసిందే. అయితే ఆహారంలో భాగంగా మనం వివిధ రూపాల్లో మనం యూజ్ చేస్తున్న దీని ఉత్పత్తులు గుండె జబ్బుల రిస్క్‌ను 17 శాతం తగ్గిస్తాయట. అలాగే స్ట్రోక్ ముప్పును కూడా 18 శాతం తగ్గిస్తాయని బోస్టన్‌లోని హార్వర్డ్ టీహెచ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు స్టడీలో వెల్లడైంది. ఆ వివరాలేంటో చూద్దాం.

* సహజంగానే సోయాబీన్‌లో ఉండే ఫైటోఈస్ట్రోజెన్లు ధమనుల పనితీరును మెరుగు పరుస్తాయని, రక్తపోటును తగ్గిస్తాయని, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయని పరిశోధకులు అంటున్నారు. సోయాలో ఉండే 9 రకాల అమైనో యాసిడ్స్, అలాగే ప్రోటీన్లు శరీరంలో అధిక కొవ్వు శాతాన్ని అరికడతాయి. గుండె కండరాలకు బలాన్నిస్తాయి.

* శరీరానికి అవసరమైన ప్రోటీన్లు అందాలంటే రోజుకు కనీసం 25 గ్రాముల సోయా ఫుడ్స్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సోయా మిల్క్ కూడా తగిన ప్రోటీన్స్‌ను అందిస్తాయి. కాకపోతే సోయా ఉత్పత్తులు అందరికీ ఒకేలా పనిచేస్తాయని గుడ్డిగా చెప్పలేం. ఆయా వ్యక్తుల జెనెటిక్ హిస్టరీని బట్టి వీటిని తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది.

* వ్యక్తుల ఆరోగ్యం, జన్యుపరమైన అంశాల ఆధారంగా సోయా ఉత్పత్తులు కొందరికి ఇబ్బంది కలిగించవచ్చు. థైరాయిడ్, ఇతర హార్మోనల్ ఇష్యూస్ ఉన్నప్పుడు సోయా ఉత్పత్తులు అలెర్జీలకు కారణం అవుతాయి. అలాగే హైప్రాసెస్ చేయబడిన సోయా ఉత్పత్తులు, సోయా సాస్ ఆరోగ్యానికి మంచిది కాదు. వీటివల్ల ప్రోటీన్లు అందవు పైగా ఇతర అనారోగ్యాలకు కారణం కావచ్చు.

నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. ఆధారాలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు. 


Similar News