జిమ్‌కు వెళ్లే పురుషుల్లో ఆ సమస్య.. ప్రతి ఏడుగురిలో ఒకరికి తగ్గుతున్న సామర్థ్యం

యువతలో రోజు రోజుకూ ఫిట్‌నెస్‌‌పై ఆసక్తి పెరుగుతోంది. నచ్చిన శరీరాకృతి కోసం, మజిల్స్ పెరుగుదలకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. పల్లెల్లు, పట్టణాలు తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వ్యాయామాలకు ప్రయారిటీ ఇస్తున్నారు.

Update: 2024-06-12 13:16 GMT

దిశ, ఫీచర్స్ : యువతలో రోజు రోజుకూ ఫిట్‌నెస్‌‌పై ఆసక్తి పెరుగుతోంది. నచ్చిన శరీరాకృతి కోసం, మజిల్స్ పెరుగుదలకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. పల్లెల్లు, పట్టణాలు తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వ్యాయామాలకు ప్రయారిటీ ఇస్తున్నారు. బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి కొందరు, ఆసక్తి కొద్దీ ఇంకొందరు, పోలీస్, ఆర్మీవంటి ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా మరికొందరు జిమ్‌లకు వెళ్తూ వర్కవుట్లు చేస్తున్నారు. అయితే కండలు పెంచాలనే ధ్యాసలో కొందరు ఓవర్ వర్కవుట్స్ చేస్తుండటం, ప్రోటీన్ సప్లిమెంట్లు తీసుకోవడం కారణంగా నష్టం జరుగుతుందని నిపుణులు చెప్తున్నారు.

గుండె జబ్బులు ఎక్కవే..

జిమ్‌లలో మితిమీరిన వర్కవుట్స్ కారణంగా గుండె జబ్బుల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు కూడా ఈ మధ్య ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్నాయి. పైగా ఇలాంటి వారిలో 18 నుంచి 30 ఏండ్లలోపు వయస్సుగలవారే ఎక్కువగా ఉండటం ఆందోళకరమైన విషయంగా రీ ప్రొడక్టివ్ బయోమెడిసిన్ సర్వే వెల్లడించింది. అధ్యయనంలో భాగంగా తరచూ జిమ్‌లకు వెళ్తున్న 152 మందిని నిపుణులు ప్రశ్నించగా ఆసక్తిరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

79 శాతం మందిలో అదే ఆసక్తి

జిమ్ సెంటర్లకు వెళ్తున్న వారిలో 79 శాతం మంది పురుషులు కండలు పెంచడానికి హైలెవల్ ఈస్ట్రోజెన్ కలిగిన ప్రోటీన్ సప్లిమెంట్లు వాడుతుండగా ఇది 52 శాతం మంది పురుషుల రీ ప్రొడక్టివ్ హెల్త్‌పై నెగెటివ్ ఎఫెక్ట్ చూపుతోంది. ప్రతీ ఏడుగురిలో ఒకరిలో సంతానోత్పత్తి సమస్యలకు దారితీస్తోంది. దీనికి తోడు మితిమీరిన వర్కవుట్లు కూడా సంతాన సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. కాగా 14 శాతం మంది పురుషులు మాత్రమే ఇలాంటి ఇబ్బందుల గురించి ఆలోచిస్తున్నట్లు సర్వే పేర్కొన్నది.

సంతోనోత్పత్తిపై ప్రభావం

జిమ్‌కు వెళ్లడం ఆరోగ్యానికి మంచిదే కానీ అక్కడ హైలెవల్ ప్రోటీన్ సప్లిమెంట్లు యూజ్ చేయడం కారణంగా సంతోనోత్పత్తిపై ప్రభావం చూపుతున్నాయని బర్మింగ్‌హామ్ యూనివర్సిటీకి చెందిన నిపుణుడు డాక్టర్ మెయురిగ్ గల్లాఘర్ అంటున్నారు. ఎనర్జీ డ్రింక్స్, విరిగిపోయిన పాలు, సోయా ప్రోటీన్‌ వంటి ప్రొడక్ట్స్ స్త్రీ హార్మోన్ అయిన ఈస్ట్రోజెన్‌ అధిక స్థాయిలను పెంచుతాయని, దీనివల్ల పురుషుల్లో స్పెర్మ్ కౌంట్, నాణ్యత తగ్గడం కారణంగా సంతానోత్పత్తిపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. 


Similar News