World's Smallest Car: ప్రపంచంలోనే అతి చిన్న కారు.. గిన్నిస్ బుక్‌లో చోటు

దిశ, ఫీచర్స్ : ఇటీవలి కాలంలో వాహనదారులు చిన్న కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అంతేకాదు యూనిక్ డిజైన్, మోడ్రన్ World's Smallest Car

Update: 2022-05-10 08:04 GMT

World's Smallest Car

దిశ, ఫీచర్స్ : ఇటీవలి కాలంలో వాహనదారులు చిన్న కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అంతేకాదు యూనిక్ డిజైన్, మోడ్రన్ ఫెసిలిటీస్‌తో డిజైన్ చేయబడిన కార్లు నడిపేందుకు చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలో ప్రపంచంలో అతి చిన్న కారు గా గుర్తింపు పొందిన 'పీల్ P50' గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ స్థానం సంపాదించింది. ఈ కారు అలెక్స్ ఓర్చిన్ అనే వ్యక్తిది కాగా.. దీని పెట్రోల్ ఖర్చు ఇతర కార్లతో పోలిస్తే చాలా తక్కువని తెలిపాడు.

134 సెం.మీ పొడవు, 98 సెం.మీ వెడల్పు గల 'పీల్ P50' ఎత్తు 100 సెం.మీ మాత్రమే. అయితే ఈ కారులో తను ఎక్కడికి వెళ్లినా.. జనాలు తనవైపే తిరిగి చూస్తారని అలెక్స్ వెల్లడించాడు. ఇది 2010లోనే ప్రపంచంలో అతి చిన్న కారు గా గుర్తించబడగా.. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. UKలోని ససెక్స్‌లో అలెక్స్ ప్రతిరోజూ ఇదే కారులో ప్రయాణిస్తుంటే అందరూ ఎగతాళి చేస్తున్నప్పటికీ.. తన అందమైన కారు మైలేజ్‌ పట్ల అతను చాలా సంతోషంగా ఉన్నాడు. ఎందుకంటే 4.5 హార్స్‌పవర్ ఇంజిన్‌ సామర్థ్యం గల ఈ కారును ఒక లీటర్ పెట్రోల్‌తో 42 కి.మీ వరకు నడపవచ్చు.


'పీల్ P50' కారును 'పీల్ ఇంజినీరింగ్ మ్యానుఫ్యాక్చర్స్' అనే కంపెనీ తయారు చేసింది. మొట్టమొదట 1962, 1965 మధ్య తయారు చేయబడగా.. ఆ తర్వాత 2010లో ఉత్పత్తి పునః ప్రారంభించారు. ఈ కారు గురించిన ఆసక్తికర విషయం ఏంటంటే.. ఇది పరిమాణంలో చిన్నదే అయినప్పటికీ చాలా ఖరీదైనది. కొత్త P50 ధర రూ. 84 లక్షల పైమాటే కాగా దీని గరిష్ట వేగం గంటకు 37 కి.మీ.


Similar News