శవాలతో సెల్ఫీలు.. శతాబ్ధాలుగా అక్కడ వారి సంప్రదాయం
దిశ, వెబ్‌డెస్క్ :సాధారణంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో మాదిరి వ్యవహార, సంప్రదాయలు ఉంటాయి.
దిశ, వెబ్‌డెస్క్ : సాధారణంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో మాదిరి వ్యవహార, సంప్రదాయలు ఉంటాయి. కాబట్టి వాటికి అనుగుణంగానే ప్రజలు వింత వింత పండగలు, జాతర్లను జరుపుకోవడం తరచూ సోషల్ మీడియాలో చూస్తున్నాం. అయితే ప్రస్తుతం అలాంటి మరో వింత సంప్రదాయపు కట్టుబాటు ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
ఇండోనేషియాలోని దక్షిణ సులవేసి ప్రాంతానికి చెందిన టోర్జా తెగవారు ప్రతి ఏటా చనిపోయిన తమ బంధువుల శవాలను తవ్వితీసి వారితో సమయాన్ని గడుపుతారు. అయితే దీని వెనుక ఉన్న ముఖ్య కారణం.. మరణించిన వారు, తమ కుటుంబ సభ్యులతో కలిసి జీవించి ఉన్న జ్ఞాపకాలను గుర్తుంచుకోవడానికి ఇదొక గొప్ప మార్గమని ఈ తెగవారి నమ్మకం. అందువల్ల ప్రతి ఏట ఈ ఆగష్టు నెల వచ్చేసరికి పాతిపెట్టిన మృతదేహాలను బయటకు తీసి వారికి కొత్త బట్టలు ధరించి, సిగరెట్ ఇచ్చి, వారితో సెల్ఫీలు తీసుకుంటుంటారు. అంతేకాదు వారితో మాట్లాడినట్లు కూడా నటిస్తారట.
'మ'నేనే' అని పిలిచే ఈ ఆచారం టోర్జా తెగ ప్రజలకు ఒక చక్కటి కుటుంబ అనుభవం. కాబట్టి ఈ తెగవారు చనిపోయిన వారి బంధువుల మృతదేహాలకు అంత్యక్రియలు జరిగే వరకు వారిని వారాలు, నెలల తరబడి ఇంట్లోనే ఉంచుకుంటారట. ఈ క్రమంలో వారికి ఆహారం తినిపించడం, వారితో సమావేశాలు ఏర్పాటు చేయడం కూడా చేస్తారట. అయితే ఈ మృతదేహాలను ఫార్మాలిన్‌లో భద్రపరచడం ద్వారా కుళ్లిపోకుండా ఉంటాయి. కాగా మూడురోజుల పాటు ఘనంగా జరుగుతున్న ఈ వేడుకలకు ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులు తరలి వస్తారు. ఇక కొన్ని శతాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న ఈ సంప్రదాయం సులవేసి ప్రాంతంలో నేటికి జరుగుతోంది.