Kolkata Rape Incident : గూగుల్ ట్రెండింగ్స్‌లో కోల్‌కతా డాక్టర్ అత్యాచారం వీడియో??
కోల్‌కతాలోని RG కర్ మెడికల్ కాలేజీ లెక్చర్ హాల్‌లో ఆగస్టు 9న ట్రైనీ డాక్టర్ పై జరిగిన హత్యాచారంతో దేశం ఉలిక్కిపడింది. సంజయ్ రాయ్ నిందితుడిగా విచారించబడుతుండగా.. లై డిటెక్టర్ టెస్ట్ లో అసలు తనకు సంబంధం లేనట్లే
దిశ, ఫీచర్స్ : కోల్‌కతాలోని RG కర్ మెడికల్ కాలేజీ లెక్చర్ హాల్‌లో ఆగస్టు 9న ట్రైనీ డాక్టర్ పై జరిగిన హత్యాచారంతో దేశం ఉలిక్కిపడింది. సంజయ్ రాయ్ నిందితుడిగా విచారించబడుతుండగా.. లై డిటెక్టర్ టెస్ట్ లో అసలు తనకు సంబంధం లేనట్లే చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆ అమ్మాయిని రేప్ చేసి.. గొంతు కోసి, తీవ్రంగా హింసించి చంపిన మృగాలను వదలద్దంటూ నిరసనలు కొనసాగుతున్నాయి. మహిళలపై లైంగిక హింసను ఎదుర్కోవడానికి వ్యవస్థాగత సంస్కరణలను డిమాండ్ చేస్తూ వైద్య నిపుణులు, వివిధ సంస్థల నేతృత్వంలోని ఆందోళనలతో జనాల నుంచి కూడా శక్తివంతమైన ప్రతిస్పందన వచ్చింది.
ఇలా ప్రత్యక్షంగా న్యాయం కోసం పోరాటం జరుగుతుంటే.. మరోవైపు పరోక్షంగా జరుగుతున్న దారుణమైన అంశాన్ని బయటపెట్టింది గూగుల్. పోర్న్ సైట్‌లలో కోల్ కతా రేప్ వీడియోల కోసం సెర్చ్ చేసే వారి సంఖ్య లక్షల్లో ఉందని చెప్పింది. మరణించిన బాధితురాలి పేరు, అత్యాచారానికి సంబంధించిన క్లియర్ వీడియో క్లిప్పింగ్ కావాలనే పదాలను ఉపయోగిస్తూ సెర్చ్ చేసినట్లు తెలిపింది. ఆమెపై దాడి రికార్డు చేయబడి ఉండొచ్చనే పుకార్లు రావడంతో ఇలా జరుగుతుంది. 2019 హైదరాబాద్ లో జరిగిన దిశ హత్యకేసు ఘటన సమయంలో కూడా ఇలాగే జరిగింది. కాగా ఈ భయంకరమైన ధోరణి జనం మనస్తత్వాలను, క్రూరమైన నేరాలను చుట్టుముట్టే దోపిడీని హైలైట్ చేస్తుంది.
అంతేకాదు ఈ విషాద ఘటన జరిగిన తర్వాత రోజే బాధితురాలి పేరుతో సోషల్ మీడియా ఎకౌంట్స్ క్రియేట్ చేసారు చాలా మంది. దీని ద్వారా ఫాలోయింగ్, మనీ పొందే ప్రయత్నం చేశారు. ఇక ఇన్ ఫ్లూయెన్సర్స్ ఆమె ఇమేజ్ ను కంటెంట్ కోసం వినియోగించారు. ఈ సమయంలోనే వీడియో అప్ లోడ్ కు సంబంధించిన పుకార్లు రాగా ఇందుకోసం సెర్చ్ పెరిగింది. ఇప్పటికే Google, పోర్న్ సైట్‌లలో ఇదే కొనసాగుతుండగా.. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉందని చెప్తుంది గూగుల్. కానీ ఈ సెర్చింగ్ ఎవరు చేస్తున్నారు? అలాంటి పోకడలకు సహకరిస్తున్నది ఎవరు? ఎందుకంటే
ఆమెకోసం ఓ వైపు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.. హృదయపూర్వక సందేశాలను పోస్ట్ చేస్తున్నారు.. మద్దతును అందిస్తున్నారు. మరోవైపు అత్యాచార వీడియో చూడాలని ఆరాటపడుతున్నారు. మొత్తానికి ఇలాంటి చర్యలతో కలవరపెడుతూ... ఎవరిని నమ్మలేని పరిస్థితుల్లోకి అమ్మాయిలను నెట్టేస్తున్నారు. అంటే బాధిత అమ్మాయి తోబుట్టువు, భార్యాపిల్లలు అయితే మాత్రమే బాధ్యతగా ఉండాలా? లేదంటే ఎవరైతే మనకేంటి అని లైట్ తీసుకోవాలా? ఇది నిజంగా మానవీయత అవుతుందా? రేపు ఇదే పరిస్థితి మనకే ఎదురైతే ఏంటి అనే భయం లేదా? ఆ పరిస్థితి రాకుండా అడ్డుకునే పోరాటం చేయకూడదా?