సంతానలేమికి యూనిక్ ప్రొటీన్.. కనుగొన్న సైంటిస్టులు
ఇన్‌ఫెర్టిలిటీ(వంధ్యత్వ) నిర్ధారణ, చికిత్సలో సాయపడే ప్రొటీన్‌ను శాస్త్రవేత్తలు మొదటిసారిగా కనుగొన్నారు.
దిశ, ఫీచర్స్ : ఇన్‌ఫెర్టిలిటీ(వంధ్యత్వ) నిర్ధారణ, చికిత్సలో సాయపడే ప్రొటీన్‌ను శాస్త్రవేత్తలు మొదటిసారిగా కనుగొన్నారు. ఇది స్పెర్మ్-ఎగ్ సంశ్లేషణ, కలయిక సమయంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాదు ఈ కొత్త ఆవిష్కరణ మెరుగైన గర్భనిరోధకాల అభివృద్ధికి మార్గం సుగమం చేస్తుంది.
ఈ ప్రొటీన్‌కు మాతృత్వానికి ప్రతీకగా కొలిచే గ్రీకు దేవత 'మైయా' పేరు పెట్టారు. Czech అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీకి చెందిన కటీనా కొమ్‌స్కోవా నేతృత్వంలోని అంతర్జాతీయ బృందం నిర్వహించిన ఈ పరిశోధన.. హ్యూమన్ ఊసైట్ ప్రొటీన్ల 'ఉత్పత్తి' కోసం సెల్ కల్చర్స్ అభివృద్ధిని కూడా హైలైట్ చేస్తుంది. సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం గేమేట్ ఫ్యూజన్(వీర్యం, అండం కలయిక) అనేది క్షీరదాల ఫలదీకరణలో క్లిష్టమైన సంఘటన. కాగా ఈ పరిశోధన బృందం ఒక కీలకమైన స్పెర్మ్ ప్రోటీన్‌తో బంధించే మానవ అండంపై కొత్త Fc రిసెప్టర్ లాంటి ప్రొటీన్ 3ని కనుగొంది. ప్రొటీన్, సంశ్లేషణ మధ్య పరస్పర చర్య మానవ వీర్యం-అండం కలయికకు, తద్వారా జీవి సృష్టికి దారితీస్తుంది.
'ఇది దాదాపు రెండు దశాబ్దాల పరిశోధన, విస్తృతమైన అంతర్జాతీయ సహకార ఫలితం. ప్రచురణలో UK, US, జపాన్ సహా ప్రపంచవ్యాప్తంగా 17 విభిన్న అనుబంధాలు ఉన్నాయి' అని కొమ్‌స్కోవా ఒక ప్రకటనలో తెలిపారు. యూకే, యూనివర్సిటీ ఆఫ్ షెఫీల్డ్‌లోని హ్యారీ మూర్ ల్యాబ్‌లో ఈ అధ్యయనం మొదట్లో ప్రారంభమైంది. కణితులకు కారణమయ్యే ఉత్పరివర్తనాల కోసం ఈ బృందం 'వన్-బీడ్ వన్-కాంపౌండ్(OBOC)' పరీక్షా పద్ధతిని ఉపయోగించింది. ఈ సమయంలో పరస్పర భాగస్వాములను ప్రత్యేక పూసలతో బంధిస్తారు. ఇందుకోసం వందల వేల సంఖ్యలో వేర్వేరు పూసలను సృష్టించారు. ఒక్కోదాని ఉపరితలం ప్రొటీన్ భాగాన్ని కలిగి ఉంటుంది. వీటిని మానవ స్పెర్మ్‌తో పొదిగించి, సంకర్షణ చెందే వాటిని వేరు చేశారు. ఇలా అనేక ప్రయోగాల తర్వాత అభ్యర్థికి సంబంధించి కలయిక ప్రోటీన్‌ను గుర్తించారు.
'మేము అండాన్ని అనుకరించే ప్రత్యేక కణ సంస్కృతులను కూడా అభివృద్ధి చేశాం. ఈ కణాలు సాధారణంగా మానవ గుడ్డు ఉపరితలంపై కనిపించే ప్రొటీన్లను 'ఉత్పత్తి' చేయగలవు. ఇది మాకు అనేక రకాల ప్రయోగాలను నిర్వహించడాన్ని సాధ్యం చేసింది' అని ప్రధాన పరిశోధకుడు జోడించారు.