ఉతికి మళ్లీ వాడే శానిటరీ ప్యాడ్స్​ వచ్చేస్తున్నాయ్​....

మార్కెట్​లో శానిటరీ ప్యాడ్స్​ వ్యాపారం చాలా పెద్దది. నేటి మహిళలు రుతుస్రావం సమయంలో వీటిని పెద్ద మొత్తంలో వినియోగిస్తున్నారు.

Update: 2023-06-18 11:34 GMT

దిశ,వెబ్​డెస్క్​ : మార్కెట్​లో శానిటరీ ప్యాడ్స్​ వ్యాపారం చాలా పెద్దది. నేటి మహిళలు రుతుస్రావం సమయంలో వీటిని పెద్ద మొత్తంలో వినియోగిస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకొని వీటిని తయారు చేసే కంపెనీలు రోజుకొకటి పుట్టుకొస్తున్నాయి. అలాగే టీవీ, పేపర్లలో వీటికి సంబంధించిన కంపెనీలు ప్రకటనల రూపంలో కోట్లు ఖర్చు చేసి ప్రచారం చేస్తున్నాయి. ఎందుకంటే ఇవి వాడి పడేసే వస్తువులు. మళ్లీ కావాలంటే కొత్తది కొనాల్సిందే. దాంతో కంపెనీలు కోట్లు సంపాదిస్తున్నాయి.

    అయితే ఇకపై ఈ కంపెనీలకు చెక్​ పడేలా ఉంది. ఎందుకంటే భవిష్యత్​లో మళ్లీమళ్లీ వినియోగించే శానిటరీ ప్యాడ్స్​ వచ్చేస్తున్నాయి. ఎలాంటి సైడ్​ ఎఫెక్ట్​ లేని, సౌకర్యవంతమైన ప్యాడ్స్​ రానున్నాయి. వీటిని ఒక సారి వినియోగించిన తరువాత మళ్లీ ఉతికి ఉపయోగించుకోవచ్చని తయారీ దారులు చెబుతున్నారు. దీంతో వినియోగదారులకు డబ్బులు ఆదా కావడంతో పాటు పర్యావరణ కాలుష్యం నుంచి రక్షించుకోవచ్చని ఆ కంపెనీ పేర్కొంటుంది. 

ఇవి కూడా చదవండి:

30 నిమిషాల్లో ఈ సమోసా తింటే రూ. 71,000 మీవే  

Tags:    

Similar News