ఒకే కాన్సెప్ట్.. అదే అందం.. అదే అనుభూతి.. డెస్టినేషన్ డూప్‌కు పెరుగుతున్న ఆదరణ (వీడియో)
డెస్టినేషన్ డూప్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ట్రెండీ కాన్సెప్ట్ అనేకమందిని ఆకర్షిస్తోంది. అందమైన పర్యాటక ప్రదేశాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు చాలామందిని ఆకట్టుకుంటున్నాయి.
దిశ, ఫీచర్స్ : డెస్టినేషన్ డూప్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ట్రెండీ కాన్సెప్ట్ అనేకమందిని ఆకర్షిస్తోంది. అందమైన పర్యాటక ప్రదేశాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు చాలామందిని ఆకట్టుకుంటున్నాయి. అటువంటి వాటిలో మన దేశంలోని బెంగుళూరు సిటీ కూడా ఉంది. ఈ నగరంలోని ప్రదేశానికి సంబంధంచిన ఫొటోలను తీసి ‘ఫొటోజెనిక్ డెస్టినేషన్ డూప్’ పేరుతో పలువురు ఇన్‌స్టా గ్రామ్ వేదికగా పోస్ట్ చేయగా 18.8 మిలియన్ల మంది షేర్ చేశారు. దీంతో ఇప్పుడు ఈ ప్రాంతం ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రసిద్ధి చెందిన ఫొటోజెనిక్ డెస్టినేషన్‌గా గుర్తింపు పొందింది.
డెస్టినేషన్ డూప్ అంటే?
వాస్తవానికి డెస్టినేషన్ డూప్ అనే ట్రావెల్ ట్రెండ్ 2024లో ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. ఎక్కడో దూరంలో ఉన్న ఒక ప్రసిద్ధి చెందిన అందమైన, ఆకర్షణీయమైన ప్రదేశం కానీ, పర్యాటక ప్రాంతం కానీ చూడాలనుకునే వారికి, అచ్చం అదే పోలికలతో కూడిన మరో ప్రదేశమే తమకు కాస్త దగ్గరలో ఉంటే దానిని ‘డెస్టినేషన్ డూప్’గా పేర్కొంటారు. పైగా ఇక్కడికి వెళ్లడానికి తక్కువ ఖర్చులు, ప్రయాణ సౌలభ్యం ఉండటంతోపాటు ఫేమస్ ఒరిజినల్ ప్లేస్ చూసినప్పుడు కలిగే అనుభూతియే, డూప్ డెస్టినేషన్ ప్లేస్‌ను చూసినప్పుడు కూడా కలుగుతుందట.
ఒకే పోలిక, అదే అనుభూతి
ఇటీవలి సర్వేలో ఒకే విధమైన పోలిక కలిగిన సౌందర్యంతో కూడిన చౌకైన డెస్టినేషన్ డూప్ ప్రదేశాల జాబితాలో బెంగుళూరు సిలికాన్ వ్యాలీకి డూప్‌గా నిలిచింది. అంటే కాలిఫోర్నియాలోని అట్రాక్టివ్ ప్లేస్ అయిన సిలికాన్ వ్యాలీని చూస్తే కలిగే ఆనందం, అనుభూతి బెంగుళూరులోని ప్రదేశాన్ని చూసినప్పుడు కలుగుతుంది. కాబట్టి సిలికాన్ వ్యాలీకి వెళ్లే ఆర్థిక స్థోమత, అవకాశం, ఆసక్తిలేని అందుకు బదులుగా ‘బెంగుళూరు సలికాన్ వ్యాలీ’ చూసి ఆనందించవచ్చు. ఉదాహరణకు దుబాయ్‌కి బదులు బాకు అనే ప్రాంతం, చియాంగ్ మాయికి బదులు మెడిలిన్, బార్సిలోనాకి బదులు వాలెన్సియా, వాంకోవర్‌కు సీటెల్, పారిస్‌కు మాంట్రియల్, సిలికాన్ వ్యాలీకి బదులు బెంగుళూరు, సింగపూర్‌కు బదులు కౌలాలంపూర్, అలాగే చలికాలంలో మంచు కురుస్తున్న ప్రకృతి అందాలను ఆస్వాదించడంలో కాశ్మీర్‌కు బదులు కోనసీమ, అరకులోయ వంటివి డెస్టినేషన్ డూప్‌లుగా ఉన్నాయి. ఒకే తరహా అనిపించేవి, అదే అనుభూతి కలిపించేవి ఇలా ప్రపంచంలో చాలా ప్రాంతాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు.
2030 నాటికి మరింత క్రేజ్
ఇటీవల డెస్టినేషన్ డూప్ ప్రాంతాలకు ట్రావెల్ చేయాలనే ట్రెండ్ విస్తరిస్తోంది. 2030 నాటికి ఈ క్రేజ్ మరింత పెరగనుందని నిపుణులు చెప్తున్నారు. దీంతో గ్లోబల్ టూరిజం మార్కెట్ 16.9 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందులో ఇండియా కూడా ఒక భాగమేనని నోయిడాకు చెందిన గ్రూప్ ట్రావెల్ కంపెనీ మైంగ్రెంట్ మ్యూజింగ్స్ అండ్ కో ఫౌండర్ సక్సేనా అంటున్నారు.
Read More..
ఆకాశంలో అమ్మ పుట్టినరోజు చేసిన బుడ్డోడు.. నెట్టింట చూసిన బెస్ట్ వీడియో ఇదే..