Ragi flour: పిండికి పురుగులు ఎందుకు పడతాయి?.. పట్టకుండా ఏం చేయాలి?

తైద, జొన్న, గోధుమ వంటి ధాన్యాలను గ్రైండ్ చేసి పిండిగా మార్చడం ద్వారా రొట్టెలను తయారు చేస్తారన్న విషయం తెలిసిందే.

Update: 2024-08-02 10:12 GMT

దిశ, ఫీచర్స్ : మనం తీసుకునే ఆహారంలో రొట్టెలు ఆరోగ్యానికి చాలా మంచిదని పోషకాహార నిపుణులు చెప్తుంటారు. ముఖ్యంగా తైద, జొన్న, గోధుమ వంటి ధాన్యాలను గ్రైండ్ చేసి పిండిగా మార్చడం ద్వారా రొట్టెలను తయారు చేస్తారన్న విషయం తెలిసిందే. వీటిలో తైదల నుంచి వచ్చే పిండి హెల్త్‌కి ఇంకా మంచిదని, తైద రొట్టెలు తరచుగా తినేవారిలో బీపీ, షుగర్ వంటివి రాకుండా ఉంటాయని పోషకాహార నిపుణులు పేర్కొంటున్నారు. అయితే పిండిని సక్రమంగా భద్రపర్చుపోవడంవల్ల పురుగులు పడుతుంటాయి. అలా జరగకూడదంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

గ్రైడింగ్‌కు ముందు ధాన్యాలను కడగాలి

తైదలు, జొన్నలు ఇలా ఏ ధాన్యాలైనా పిండిగా మార్చడానికి గ్రైడింగ్ చేస్తారు. కొందరు మార్కెట్ నుంచి తెచ్చిన వాటిని బాగానే ఉంటాయని డైరెక్టుగా గ్రైండ్ చేస్తుంటారు. దీనివల్ల పిండి పురుగులు పట్టే చాన్స్ ఉంటుంది. అలా జరగవద్దంటే ముందుగా వాటిని నీటితో కడిగి ఎండలో ఆరబెట్టాలి. బాగా ఎండిన తర్వాత మాత్రమే పిండి పట్టించాలని, లేకపోతే ఫంగస్ పేరుకుపోయి పిండి త్వరగా పాడవుతుందని నిపుణులు చెప్తున్నారు.

గాలి తగలని ప్రదేశంలో ఉంచాలి

పిండిని, ముఖ్యంగా తైద పిండిని ఏదైనా పాత్రలో లేదా కంటైనర్‌లో పెట్టినప్పుడు గాలి తగలకుండా దానికి మూకుడు పెట్టాలి. సరిగ్గా పెట్టకపోయినా, తేమ చేరే పరిస్థితిలో ఉంచినా పురుగులు పడతాయి. గాలి చొరబడే కంటైనర్‌లో ఉంచడంవల్ల ఆక్సీకరణ పెరిగి తైద పిండి మరింత త్వరగా పాడవుతుంది.

తక్కువ ఉష్ణోగ్రతలో భద్రపర్చాలి

వేడి ఎక్కువగా ఉండే ప్రదేశంలో పెట్టడంవల్ల తైద, జొన్న, గోధుమ ఏ పిండి అయినా త్వరగా పురుగులు పడుతుంది. ఎక్కువరోజులు నిల్వ ఉండాలంటే కంటైనర్‌లో వేసి, మూత పెట్టిన తర్వాత ఒకే విధమైన సాధారణ ఉష్ణోగ్రత ఉండే ప్రదేశంలో లేదా చల్లని ప్రదేశంలో స్టోర్ చేయాలి. అలా కాకుండా కాసేపు చల్లగా, మరి కాసేపు వేడిగా మారే వాతావరణంలో ఉంచితే పాడవుతుంది. అలాగే గదిలో కిటికీల పక్కన స్టోర్ చేయడంవల్ల కూడా కిటికిల్లోంచి బయటి వాతావరణ ప్రభావంవల్ల పిండి త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నార్మల్ వెదర్ ఉండే ప్రదేశంలో స్టోర్ చేయాలి. ఈ విధమైన జాగ్రత్తలతో పిండికి పురుగులు పట్టకుండా ఎక్కువ రోజులు వినియోగించుకోవచ్చు అంటున్నారు నిపుణులు. 

Tags:    

Similar News